
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) చాలాకాలంగా వరుస ఫెయిల్యూర్స్ అందుకుంటున్నాడు. అందుకే, ఈసారి 'ఆంధ్ర కింగ్ తాలుకా' సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 28న విడుదల కానుంది. ఇదలా ఉంటే సీనియర్ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' షోకి హాజరైన రామ్.. తన కుటుంబం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
ఒక్కరాత్రిలోనే అంతా పోయింది
రామ్ మాట్లాడుతూ.. నా కుటుంబం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అమ్మది హైదరాబాద్, నేనిక్కడే పుట్టాను. నాన్నది విజయవాడ. 1988లో కుల ఘర్షణలు జరిగి చాలా పెద్ద గొడవలు జరగాయి. అప్పుడే నాన్న జపాన్ నుంచి తిరిగొచ్చాడు. ఆ గొడవల్లో మా కుటుంబం అంతా కోల్పోయింది. ఒక్క రాత్రిలోనే మళ్లీ జీరోకు వచ్చేశాం. ఇక విజయవాడలో ఉండటం సరికాదని భావించి చెన్నై షిఫ్ట్ అయ్యాం. సర్వం పోగొట్టుకున్న నాన్న మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాడు. కిందనుంచి పైకి రావడం వేరు.. కానీ కింది నుంచి పైకొచ్చి, అంతా పోగొట్టుకుని ఇంకో సిటీకి వెళ్లి మళ్లీ లైఫ్ స్టార్ట్ చేయడం వేరు.
లగ్జరీ ఇంటి నుంచి..
అందుకే నాన్నంటే నాకు ఎనలేని గౌరవం. నేను గోల్డెన్ స్పూన్‌తో పుట్టాను.. మధ్యలో అంతా పోగొట్టుకున్నాను.. నాన్న కష్టం వల్ల మళ్లీ ఒకప్పటి స్థాయికి చేరుకున్నాను. అందుకు మీకో ఉదాహరణ చెప్తా.. విజయవాడలోని మా ఇంట్లో నాకు పెద్ద బొమ్మల గదుండేది. చెన్నైకి షిఫ్ట్ అయ్యాక మేమున్న ఇల్లు.. నా బొమ్మల గదిలో సగం కూడా లేదు. లగ్జరీ భవంతి నుంచి చిన్న ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నాన్న జీతం రూ.4-5 వేలుండేది అని రామ్ పోతినేని చెప్పుకొచ్చాడు.
చదవండి: నా కుమారుడి కెరీర్.. అక్కగా తనే చూసుకుంటుంది: రవితేజ