'రాసి పెట్టుకోండి'.. పెద్దిపై రామ్ చరణ్ గూస్‌బంప్స్‌ స్పీచ్..! | Ram charan Shares his Latest Movie Peddi experince in Promotions | Sakshi
Sakshi News home page

Ram Charan: 'రాసి పెట్టుకోండి'.. పెద్దిపై రామ్ చరణ్ గూస్‌బంప్స్‌ స్పీచ్..!

May 25 2026 5:30 PM | Updated on May 25 2026 5:55 PM

Ram charan Shares his Latest Movie Peddi experince in Promotions

రామ్ చరణ్ హీరోగా వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇ‍ప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఇటీవలే ఈ చిత్రంలోని స్పెషల్‌ సాంగ్‌ను కూడా విడుదల చేశారు.

ఈ మూవ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో పెద్ది హీరో రామ్ చరణ్ ప్రమోషన్లతో ఫుల్ బిజీ అయిపోయారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఈవెంట్‌కు చెర్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ది మూవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డానని రామ్ చరణ్ అన్నారు. ఈ మూవీ కోసం దాదాపు రెండన్నరేళ్ల పాటు ప్రాణం పెట్టి చేశానని చెర్రీ పంచుకున్నారు. అందరం కూడా కలిసికట్టుగా ఈ మూవీ కోసం శ్రమించామని పేర్కొన్నారు. రాసి పెట్టుకోండి.. ఈ సినిమా నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అవుతుందని రామ్ చరణ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది.
 

 

Advertisement
 
Advertisement
Advertisement