క్యారెక్టర్‌ ఉంటే తిరుగుండదు | Rajendra Prasad about Organic Mama Hybrid alludu movie | Sakshi
Sakshi News home page

క్యారెక్టర్‌ ఉంటే తిరుగుండదు

Published Wed, Feb 22 2023 12:57 AM | Last Updated on Wed, Feb 22 2023 12:58 AM

Rajendra Prasad about Organic Mama Hybrid alludu movie - Sakshi

‘‘యాక్టర్‌ కావటానికి నటన తెలిస్తే చాలు.. కానీ, సక్సెస్‌ఫుల్‌ యాక్టర్‌ కావాలంటే తప్పకుండా క్యారెక్టర్‌ కావాలి.. అది ఉంటే తిరుగుండదని ఈ తరం నటీనటులకు చెబుతున్నాను. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’’ అని నటుడు రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు.

సోహైల్, మృణాళిని జంటగా రాజేంద్ర ప్రసాద్, మీనా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి సమర్పణలో కోనేరు కల్పన నిర్మించిన ఈ సినిమా మార్చిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ– ‘‘వినోదం’ సినిమా తర్వాత నేను చేసిన కంప్లీట్‌ కామెడీ మూవీ ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’. ప్రేక్షకుల నవ్వులు చూసేందుకు ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.

మీనా మాట్లాడుతూ– ‘‘రాజేంద్రప్రసాద్‌గారితో 30ఏళ్ల తర్వాత ఈ మూవీలో చేశాను. కృష్ణారెడ్డిగారితో సినిమా చేసే అవకాశం ఇన్నేళ్లకు కుదిరింది. తొలిసారి ఒక లేడీ ప్రొడ్యూసర్‌తో (కల్పన) పని చేయడం హ్యాపీ’’ అన్నారు. ‘‘ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది’’ అన్నారు కె. అచ్చిరెడ్డి. ‘‘ఈ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు సోహైల్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement