నిశ్చితార్థం పూర్తి  | Sakshi
Sakshi News home page

నిశ్చితార్థం పూర్తి 

Published Sat, Sep 30 2023 12:37 AM

Raaju Bonagaani Engagement: Filming wraps - Sakshi

ప్రవీర్‌ శెట్టి, ఐశ్వర్యా గౌడ జంటగా రాజు బొనగాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంగేజ్‌మెంట్‌’. రోడియమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో జయరామ్‌ దేవ సముద్ర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది.

జయరామ్‌ దేవ సముద్ర మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘ఎంగేజ్‌మెంట్‌’.  సినిమా ఔట్‌పుట్‌ బాగా వచ్చింది. రాజు బొనగాని అద్భుతంగా తీశాడు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒడియా భాషల్లో రిలీజ్‌ చేస్తాం. త్వరలో రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దిలీప్‌ బండారి, రజత్‌ గోష్, కెమెరా: వెంకట్‌ మన్నం, సహనిర్మాతలు: లక్ష్మీకాంత్‌ ఎన్‌ఆర్, నారాయణ స్వామి .ఎస్‌. 

Advertisement
 
Advertisement
 
Advertisement