Punch Prasad Home Tour: ముగ్గులతో వెలిగిపోతున్న పంచ్‌ ప్రసాద్‌ ఇల్లు

Punch Prasad Released Home Tour Video - Sakshi

కమెడియన్‌ పంచ్‌ ప్రసాద్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే! కిడ్నీ సంబంధ సమస్యలతో సతమతమవుతున్న ఆయనకు దగ్గరుండి వైద్యం చేయిస్తానన్నాడు కిర్రాక్‌ ఆర్పీ. ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి కోలుకుంటున్న పంచ్‌ ప్రసాద్‌ సిటీ వదిలి తన సొంతింటికి వెళ్లి వారం రోజులు అక్కడే ఉన్నాడు. ఈ సందర్భంగా తమ ఇంటిని చూపిస్తూ హోమ్‌ టూర్‌ వీడియో చేశాడు.

తమది G+1 అని కాకపోతే కింది పోర్షన్‌లో పిన్నివాళ్లు ఉంటారని, పై పోర్షన్‌లో తన తల్లి ఉంటుందని చెప్పాడు. ఆ పిన్ని.. అమ్మకు సొంత చెల్లి కావడంతో ఇంట్లో ఉంటున్నందుకు ఇంతవరకు ఒక్కరూపాయి కూడా తీసుకోలేదన్నాడు. అసలు పిన్నిని వదిలి అమ్మ కూడా ఒక్క రోజు ఉండలేదని చెప్పుకొచ్చాడు. మరోవైపు పంచ్‌ ప్రసాద్‌ భార్య.. ఇంట్లో తన భర్తకు వచ్చిన షీల్డ్‌లు చూపిస్తూ మురిసిపోయింది. పనిలో పనిగా ఇల్లునంతటినీ కెమెరాలో బంధించింది. అలాగే కిందకు వెళ్లి అక్కడ ఉన్న గదులను కూడా చూపించింది. ఇంటి లోపలా, బయట వాకిలి నిండా ముగ్గులు వేయగా.. ప్రతి ఏడాది ఇలాగే పెయింటింగ్‌ ముగ్గులు వేస్తారని చెప్పుకొచ్చింది ప్రసాద్‌ భార్య.

చదవండి: పిచ్చెక్కిస్తున్న పఠాన్‌.. నాలుగు రోజుల్లోనే రూ.400 కోట్లు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top