ఎస్‌పీబీ చాక్లెట్ విగ్రహం : వైరల్‌

Puducherry cafe makes 339 kg chocolate statue in honour of SPB - Sakshi

పుదుచ్చేరి: 2020వ సంవత్సరంలో  ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది సంగీతాభిమానులను తీవ్ర విషాదంలో ముంచేసిన వార్త గానగంధర్వుడు ఎస్‌పీ బాలసుబ్రహ‍్మ​ణ్యం అకాల మరణం.  కోవిడ్-19 మహమ్మారి బారిన పడిన సెప్టెంబర్ 25న ఆయన ఈ లోకాన్ని వీడిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ప్రతీక్షణం ఆయన్ను తలచుకోని అభిమాని లేరంటే అతిశయోక్తి కాదు. తాజాగా  పుదుచ్చేరిలోని ఒక బేకరి సంస్థ బాలుకి విభిన్నంగా  నివాళులర్పిస్తోంది. చాక్లెట్‌తో ప్రముఖుల విగ్రహాలను  ఏర్పాటుచేసే సాంప్రదాయాన్ని పాటిస్తున​ సంస్థ తాజాగా ఎస్‌పీబీకి  నివాళిగా ఏకంగా 339 కిలోలతో 5 అడుగుల 8 అంగుళాల ఎత్తున్న చాక్లెట్  విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.  ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.(ఒక శకం ముగిసింది!)

పుదుచ్చేరిలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఏటా పలు రంగాలలో గొప్ప పేరు గాంచిన ప్రముఖులను స్మరించుకోవడం  ఏర్పాటు చేయడం జునిక బేకరీకి అలవాటు. ఈ క్రమంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రాహాన్ని కూడా పూర్తిగా చాక్లెట్‌తో మాత్రమే రూపొందించి ప్రదర్శనకు ఉంచింది. ఇది జనవరి 3వరకు ప్రదర్శనలో ఉంటుందని చాక్లెట్ విగ్రహాన్ని తయారు చేసిన చెఫ్‌ రాజేంద్రన్  చెప్పారు. 339 కిలోల బరువున్నఈ విగ్రహాన్ని రూపొందించడానికి తమకు 161 గంటలు పట్టిందని  తెలిపారు. దీనికి మంచి ఆదరణ లభిస్తుండటంతో బేకరీ యజమాని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే కోయంబత్తూరులో సిరితుళి అనే స్వచ్ఛంద సంస్థ ఎస్‌పీబీ వనం పేరుతో నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పనస, మామిడి, ఎర్ర చందనం, సాండర్స్, టేకు, రోజ్‌వుడ్, వెదురు, మహోగనితోపాటు  ఇతర చెట్లను పెంచనున్నారు. కాగా ఇంతకుముందు దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలం చాకొలెట్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అలాగే  600 కిలోలసూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌  చాకొలేట్‌ విగ్రహాన్ని  తయారుచేసిన  కబాలీ ఫ్యాన్స్‌ను ఆకర్షించింది. అలాగే కొంతమంది క్రికెట్ ఆటగాళ్ళ విగ్రహాలను కూడా రూపొందించింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top