Bhushan Kumar: హీరోలు కోట్ల రెమ్యునరేషన్‌ డిమాండ్‌.. మేమెందుకు నష్టపోవాలన్న నిర్మాత

Producer Bhushan Kumar Slams Actors who Charge Rs 20 to 25 Cr - Sakshi

సినిమాకు పెడుతున్న పెట్టుబడిలో సగం హీరోల పారితోషికమే ఉంటుంది. ఆ రేంజ్‌లో డిమాండ్‌ చేస్తుంటారు కథానాయకులు. దీనివల్ల సినిమా ఫ్లాప్‌ అయినప్పుడు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు నిర్మాతలు. ఇదే విషయాన్ని ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ సైతం ఓ ఇంటర్వ్యూలో ధృవీకరిస్తూ కొందరు తారలు మరీ ఎక్కువ మొత్తాన్ని అడుగుతారని అసహనం వ్యక్తం చేశాడు. తాజాగా మరో అగ్ర నిర్మాత, టీ సిరీస్‌ అధినేత భూషణ్‌ కుమార్‌ సైతం ఈ ధోరణిని ఎండగడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

'కొందరు హీరోలు చాలా బాగా అర్థం చేసుకుంటారు. నాకింత కావాలని బెట్టు చేయరు. కానీ కొందరు మాత్రం అదేమీ పట్టించుకోకుండా వారికి కావాల్సింది అప్పజెప్పాలని డిమాండ్‌ చేస్తారు. లేదంటే కలిసి పనిచేసేదే లేదని తేల్చి చెప్తారు. అలాంటి సందర్భాల్లో మేము కూడా కుదరదంటే వెళ్లిపోండనే చెప్తాం. మేమెందుకు తలకు మించిన భారాన్ని మోయాలి? ఒక్క హీరోకే రూ.20-25 కోట్ల దాకా ఇచ్చుకున్నాక సినిమా సరిగా ఆడకపోతే అది మాకు భారమే కదా! చిన్న సినిమాకు కూడా రూ.20 కోట్లు డిమాండ్‌ చేస్తారు. అంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్‌ ఇచ్చుకోలేనప్పుడు కొన్నిసార్లు వారితో బేరసారాలు జరుపుతాం' చెప్పుకొచ్చాడు.

కాగా గతేడాది బాలీవుడ్‌కు హిట్‌ ఇచ్చిన హీరోకు కాస్ట్‌లీ గిఫ్ట్‌ ఇచ్చాడు భూషణ్‌. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న బాలీవుడ్‌కు గతేడాది భూల్‌ భులాయా 2 సక్సెస్‌తో ఆక్సిజన్‌ అందించాడు కార్తీక్‌ ఆర్యన్‌. ఈ సంతోషంతో అతడికి మెక్‌లారెన్‌ జీటీ అనే స్పోర్ట్స్‌ కారు గిఫ్టిచ్చాడు భూషణ్‌ కుమార్‌. అలాగే ఆదిపురుష్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌కు లగ్జరీ ఫెరారీ ఎఫ్‌8 ట్రిబ్యూటోను కానుకగా ఇచ్చాడు. ఈ రెండు కార్ల విలువ కోట్లల్లోనే ఉండటం విశేషం.

చదవండి: రెండేళ్లు స్ట్రగుల్‌.. ఒక తోడు కావాలనిపించింది: దిల్‌ రాజు
బాత్రూమ్‌లోకి వెళ్లి ఏకధాటిగా ఏడ్చేశా: నాటునాటు కొరియోగ్రాఫర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top