ప్రియుడితో కలిసి విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తోన్న ప్రియాభవానీ | Priya Bhavani Shankar goes skydiving on her holiday | Sakshi
Sakshi News home page

Priya Bhavani Shankar: ప్రియుడితో కలిసి విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తోన్న ప్రియాభవానీ

Aug 29 2022 6:52 AM | Updated on Aug 29 2022 7:11 AM

Priya Bhavani Shankar goes skydiving on her holiday - Sakshi

సాధారణంగా ఇండియాలో వేసవికాలంలో విహారయాత్రలకు వెళ్తారు. కానీ హీరోయిన్లు మాత్రం వర్షాకాలంలో విదేశీ ట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. నవ దంపతులు విఘ్నేష్‌ శివన్, నయనతార ఇప్పటికే స్పెయిన్‌ దేశంలో ఎంజాయ్‌ చేస్తుండగా సాక్షి అగర్వాల్‌ వంటి కొందరు హీరోయిన్లు కూడా విదేశాల్లో గడిపేస్తున్నారు. ఈ జాబితాలోకి ప్రియా భవాని శంకర్‌ చేరింది. ప్రియుడితో కలిసి విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తోంది.

కోలీవుడ్‌లో బిజీగా ఉన్న బ్యూటీ ఈమె. యువ హీరోలు, నవ హీరోలు అనే తారతమ్యం లేకుండా అందరితో జతకట్టేస్తోంది. పాత్రల పరిధి కూడా పట్టించుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఒప్పేసుకుని రెండు చేతులా సంపాదించుకునే పనిలో పడింది. అలా ఇటీవల ధనుష్‌ సరసన నటించిన చిత్రం తిరుచిట్రంపలం. ఇందులో ఒక పాట రెండు మూడు సన్నివేశాలు మాత్రమే ఈ అమ్మడు కనిపిస్తుంది. అయినా చిత్ర విజయం సాధించడంతో అందులో తానున్నాననే క్రెడిట్‌ కొట్టేస్తోంది.

బిజీ షెడ్యూల్‌లోనూ రిలీఫ్‌ కోసం తన ప్రియుడు రాజవేల్‌తో కలిసి వారం క్రితం విదేశాలకు చెక్కేసింది. అక్కడ ఎంజాయ్‌ చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాలలో విడుదల చేసింది. ట్రైనర్‌ సహాయంతో హెలీకాప్టర్‌ నుంచి పారాచ్యూట్‌ ద్వారా కిందికి దిగుతున్న దృశ్యాలు ఉన్నాయి. ప్రస్తుతం జయం రవికి జంటగా అఖిలన్, ఎస్‌జే సూర్య సరసన బొమ్మై, శింబుతో పత్తు తల, రుద్రన్‌ అనే మరో చిత్రంలో నటిస్తున్న ప్రియా భవాని శంకర్‌ త్వరలో ఇండియన్‌–2 చిత్ర షూటింగ్‌లో పాల్గొనడానికి రెడీ అవుతోంది.  

చదవండి: (మాజీ బాయ్‌ప్రెండ్‌తో సుష్మితా సేన్‌ షాపింగ్‌, వీడియో వైరల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement