
ప్రభాస్ చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. ప్రస్తుతం 'రాజాసాబ్' పూర్తి చేసే బిజీలో ఉన్నాడు. అలానే 'ఫౌజీ' (వర్కింగ్ టైటిల్) షూటింగ్ కూడా మరోవైపు జరుగుతోంది. ఇది కాకుండా లైన్‌లో 'స్పిరిట్', 'సలార్ 2', 'కల్కి 2' ఉన్నాయి. ఈ మూడింటి షూటింగ్స్ మొదలు కావాల్సి ఉంది. సలార్, కల్కి సీక్వెల్స్ తీయడానికి ఇంకా సమయముంది. 'స్పిరిట్' గురించి ఇప్పుడు సరికొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి.
(ఇదీ చదవండి: 2 వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్)
'అర్జున్ రెడ్డి', 'యానిమల్' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత సందీప్ రెడ్డి వంగా తీస్తున్న సినిమా 'స్పిరిట్'. ఇందులో ప్రభాస్ హీరోగా నటిస్తాడు. పవర్ ఫుల్ పోలీస్ లుక్ ఉండబోతుందని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. హీరోయిన్‌గా తొలుత దీపిక పదుకొణెని అనుకున్నారు కానీ చివరకు తృప్తి దిమ్రి వచ్చి చేరింది. చాన్నాళ్లుగా ఈ ప్రాజెక్ట్ పెండింగ్లో ఉంది. అయితే ఈ మూవీ కథేంటి? జానర్ ఏంటి? అనే విషయాలు ఇప్పటివరకు వినిపించలేదు.
కానీ ఇప్పుడు సడన్‌గా 'స్పిరిట్' గురించి సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. డార్క్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రాన్ని తీయబోతున్నారని సమాచారం. ఈ సినిమాకు కేవలం ఆరు నెలల్లో పూర్తి చేసేలా సందీప్ ప్లాన్ చేశాడని, గత మూవీస్‌తో పోలిస్తే ప్రభాస్ బరువు తగ్గి, డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఇందులో నిజానిజాలు సంగతి పక్కనబెడితే రూమర్స్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. ఒకవేళ ఇవి గనక నిజమైతే మాత్రం అంచనాలు పెరగడం గ్యారంటీ.
(ఇదీ చదవండి: 'కొత్త లోక' సరికొత్త రికార్డ్.. దీనిదే అగ్రస్థానం)