Prabhas Salaar Jagapathi Babu First Look Teaser Released - Sakshi
Sakshi News home page

Salaar Update: రాజమన్నార్‌ రౌద్రం.. రఫ్‌ లుక్‌లో జగ్గూభాయ్‌

Aug 23 2021 11:03 AM | Updated on Aug 23 2021 12:46 PM

Prabhas Salaar Update: Jagapathi Babu Rajamanaar First Look Teaser Released - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్‌. ఇప్పటికే ప్రమోషన్స్‌ని స్టార్ట్‌ చేసిన చిత్ర బృందం తాజాగా మరో కీలక అప్‌డేట్‌ను వదిలింది. ఈ చిత్రంలో రాజమన్నార్‌ పాత్రను ఎవరు పోషించనున్నారో మేకర్స్‌ రివీల్‌ చేశారు. ముందుగా ఊహించినట్లుగానే రాజమన్నార్‌ పాత్రను జగపతి బాబు పోషించనున్నారు.

దీనికి సంబంధించిన లుక్‌ని డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ రిలీజ్‌ చేశారు. ప్రతినాయకుడి పాత్రలో జగపతి బాబు ఒదిగిపోతాడన్న విషయం తెలిసిందే. గతంలో అరవింద సమేతలో.. బసిరెడ్డిగా రౌద్రం ప్రదర్శించాడాయన. ఇక తాజాగా రాజమన్నార్‌ లుక్‌లో అంతకు మించి రౌద్రం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. విలనిజాన్ని ఓ రేంజ్‌లో చూపెట్టే ప్రశాంత్‌.. రాజమన్నార్‌ను అంతకుమించి చూపించబోతున్నట్లు లుక్‌తోనే అర్థమవుతోంది. 

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగండూర్ నిర్మించనున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా శృతి హాసన్‌ నటిస్తుంది. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌14న విడుదల కానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ భువన్ గౌడ నిర్వహిస్తున్నారు.

చదవండి: KGF Chapter2: రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు షాక్‌
హీరోయిన్‌ రకుల్‌ని ఇలా ఎప్పుడైనా చూశారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement