ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం స్పిరిట్ (Spirit Movie). అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు వంగా. తన సినిమాతో ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించే ఈ డైరెక్టర్ ఈసారి ప్రభాస్‌తో ఏం మ్యాజిక్ చేయబోతున్నాడో అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నిన్న (అక్టోబర్ 23న) ప్రభాస్ (Prabhas) బర్త్‌డేను పురస్కరించుకుని ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు.
ఆడియో గ్లింప్స్
గురువారం రాత్రి 11 గంటలకు 'సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిలిం స్పిరిట్' అంటూ 1.31 నిమిషాల ఆడియో గ్లింప్స్ వదిలారు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఐపీఎస్ అధికారి ప్రభాస్ గురించి ప్రకాశ్‌రాజ్ ఇలా అంటాడు. వీడి గురించి విన్నాను.. యూనిఫామ్ ఉన్నా, లేకపోయినా ప్రవర్తనలో తేడా ఉండదని! ఖైదీ యూనిఫాంలో ఎలా ప్రవర్తిస్తాడో చూద్దాం!
ప్రభాస్ డైలాగ్
వీడి బట్టలూడదీసి మెడికల్ టెస్ట్‌కు పంపించండి అంటాడు. అందుకు ప్రభాస్.. మిస్టర్ సూపరింటెండెంట్, నాకు చిన్నప్పటినుంచి ఒక చెడ్డ అలవాటుంది.. అని సగం చెప్పడంతోనే గ్లింప్స్ వీడియో పూర్తయింది. ప్రభాస్‌ను ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్‌స్టార్‌గా అభివర్ణిస్తూ టైటిల్ కార్డ్ వేయడం విశేషం! గ్లింప్సే ఈ రేంజ్‌లో ఉంటే టీజర్, ట్రైలర్ ఇంకెలా ఉంటుందో అని అభిమానులు ఎగ్జయిట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్, కాంచన, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హర్షవర్దన్ రాణె సంగీతం అందిస్తున్నాడు. స్పిరిట్ వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
చదవండి: ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత


