రాధేశ్యామ్‌ రిలీజ్‌.. ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదం

Prabhas Fan Seriously Injured During Fixing The Radhe Shyam Flexi, Details Inside - Sakshi

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన 'రాధేశ్యామ్‌' చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా థియేటర్స్‌ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఏ థియేరట్‌ వద్ద చూసినా డార్లింగ్‌ అభిమానుల హంగామా కనిపిస్తుంది. సాహో తర్వాత మూడేళ్లకు ప్రభాస్‌ సినిమా రిలీజ్‌ కావడంతో ఫ్యాన్స్‌ ఆనందంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో థియేటర్స్‌ ద్ద భారీ కటౌట్లు పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఈ క్రమంలో కర్ణాటకలోని కారంపూడి ఐమ్యాక్స్‌ థియేటర్‌ వద్ద అపశృతి నెలకొంది. ఈ ప్రమాదంలో ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. థియేటర్‌ వద్ద 37ఏళ్ల చల్లా కోటేశ్వర రావు అనే వ్యక్తి ఫ్లెక్సీ కడుతుండగా అది విరిగి పక్కనే ఉన్న కరెంట్‌ తీగలపై పడింది. ఈ ప్రమాదంలో కోటేశ్వర రావు అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top