Tarsame Singh Saini Aka Taz: ప్రముఖ సింగర్ కన్నుమూత.. కరోనా కారణంగా చికిత్స ఆలస్యం !

Pop Singer Tarsame Singh Saini Aka Taz Passed Away At Age 54 - Sakshi

Pop Singer Tarsame Singh Saini Aka Taz Passed Away At Age 54: సినీ ఇండస్ట్రీలో మరోసారి విషాదం నెలకొంది. ప్రముఖ బాలీవుడ్ పాప్​ సింగర్​​ తాజ్​ (తర్సామీ సింగ్  సైనీ) 54 ఏళ్ల వయసులో కన్ను మూశారు. జానీ జీగా పేరొందిన తర్సామీ సింగ్ సైనీ గత కొంతకాలంగా హెర్నియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఆరోగ్య పరిస్థితి విషమించిన ఆయనకు కరోనా కారణంగా శస్త్ర చికిత్స చేసేందుకు ఆలస్యమైందని తెలుస్తోంది. అయితే ఇటీవలే కోమా నుంచి కోలుకున్న తాజ్ శుక్రవారం (ఏప్రిల్​ 29) యూకేలో మరణించారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 

ప్యార్​ హో గయా, నాచేంగే సారి రాత్, గల్లాన్ గోరియన్​ వంటి 90వ దశకం హిట్​ సాంగ్స్​కు పేరుగాంచింది తాజ్​ గ్రూప్​ స్టీరియో నేషన్. ఇది 1996లో ఏర్పడింది. 1989లో హిట్​ ది డెక్ ఆల్బమ్​తో తాజ్ స్టీరియో నేషన్​ ప్రజాదరణ పొందింది. యూకేలోని ఇతర భారతీయ కళాకారులతో పాటు తాజ్.. ఆసియా ఫ్యూజన్​ సంగీతానికి మార్గదర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ​డోంట్​ స్టాప్​ డ్రీమింగ్​, సాంబార్​ సల్సా వంటి చిత్రాలలో తాజ్ పనిచేశారు. తుమ్​ బిన్, కోయి మిల్​ గయా, రేస్ వంటి పాపులర్​ హిందీ మూవీస్​తోపాటు ఇటీవల వచ్చిన బట్లా హౌజ్​ సినిమాలో పాటలు పాడారు. 

చదవండి: బాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాలకు నో చెప్పి రిస్క్‌ తీసుకున్నా:కంగనా

చదవండి: వెంకటేష్-సల్మాన్ ఖాన్ సినిమా షురూ.. విలన్​గా ?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top