అక్షరాన్ని మార్చగలరు.. అభిమానాన్ని కాదు | Pooja Hegde Reacts on telugu film industry | Sakshi
Sakshi News home page

అక్షరాన్ని మార్చగలరు.. అభిమానాన్ని కాదు

Nov 9 2020 6:20 AM | Updated on Nov 9 2020 6:20 AM

Pooja Hegde Reacts on telugu film industry - Sakshi

‘సౌత్‌ వాళ్లకు నడుము అంటే ప్రత్యేక ఆసక్తి’ అంటూ ఓ ఇంగ్లిష్‌ వీడియో ఇంటర్వ్యూలో పూజా హెగ్డే చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. సోషల్‌ మీడియాలో పలు విమర్శలు ఎదుర్కొన్నారు పూజా. ఆదివారం ఈ విషయం గురించి స్పందించారామె. దీనికి సంబంధించి ఓ నోట్‌ను విడుదల చేశారు. అందులో ఈ విధంగా రాసుకొచ్చారు. ‘‘నేను ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలను వేరే సందర్భానికి అన్వయించారు. అక్షరాన్ని మార్చగలరేమో కానీ, అభిమానాన్ని కాదు. నాకు ఎప్పటికీ తెలుగు చలన చిత్రపరిశ్రమ ప్రాణసమానం. ఇది నా చిత్రాలను అభిమానించేవారికీ నా అభిమానులకూ తెలిసినా ఎటువంటి అపార్థాలకు తావివ్వకూడదనే నేను మళ్లీ చెబుతున్నాను. నాకెంతో ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను’’ అని పేర్కొన్నారు పూజా హెగ్డే. అలాగే తాను ఇచ్చిన పూర్తి వీడియో ఇంటర్వ్యూను కూడా చూడమని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement