పొన్నియన్‌ సెల్వన్‌ నుంచి ఫస్ట్‌సాంగ్‌ అవుట్‌.. ఆకట్టుకుంటున్న లిరిక్స్‌ | Ponge Nadhi Lyrical Video Release From Maniratnam Ponniyin Selvan | Sakshi
Sakshi News home page

Ponniyin Selvan: పొన్నియన్‌ సెల్వన్‌ నుంచి ఫస్ట్‌సాంగ్‌ అవుట్‌.. ఆకట్టుకుంటున్న లిరిక్స్‌

Published Mon, Aug 1 2022 8:40 AM | Last Updated on Mon, Aug 1 2022 8:58 AM

Ponge Nadhi Lyrical Video Release From Maniratnam Ponniyin Selvan - Sakshi

ప్రముఖ దర్శకుడు మణిరత్నం అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పొన్నియన్‌ సెల్వన్‌: పార్ట్‌ 1’.  పదో శతాబ్దంలో చోళ సామ్రాజ్యంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల సమాహారంగా ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్‌ 30న ఈ మూవీ ఐదు(తెలుగు,తమిళం, మలయాళం, హిందీ, కన్నడ) భాషల్లో విడుదల కానుంది. మూవీ ప్రమోషన్లను వేగవంత చేసిన చిత్ర బృందం ఇప్పటికే ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను విడుదల చేయగా.. వీటికి విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

చదవండి: సినిమా రిలీజ్‌ కాదన్నారు.. వారం క్రితం ఏడ్చేశాను: నిఖిల్

‘పొంగే నది పాడినది’ అంటూ సాగే ఈ పాట సింగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించిన ఈ పాటను ఏఆర్‌ రెహమాన్, ఏఆర్‌ రైహానా, బాంబా బక్యా ఆలపించారు. కాగా ఈ సినిమాకు ఏఆర్‌ రహామాన్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. కాగా మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రంలో చియాన్‌ విక్రమ్‌, కార్తీ, ‘జయం’ రవి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, త్రిష, శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, మద్రాస్‌ టాకీస్‌పై సుభాస్కరన్‌, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement