Police Case Filed On Actor Ravi Teja Mother, Details Inside - Sakshi
Sakshi News home page

Ravi Teja: రవితేజ తల్లిపై కేసు నమోదు.. అసలు ఏం జరిగిందంటే..

Jan 21 2022 3:58 PM | Updated on Jan 21 2022 4:40 PM

Police Case Filed On Actor Ravi Teja Mother, Details Inside - Sakshi

Police Case Filed On Actor Ravi Teja Mother, Details Inside: టాలీవుడ్‌ స్టార్‌ హీరో రవితేజ తల్లిపై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద పుష్కర కాలువను ధ్వంసం చేసిన కేసులో రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మితో పాటు మర్రిపాకకు చెందిన సంజయ్‌లపై కేసు నమోదైంది.

సర్వే నంబర్ 108, 124లో పుష్కర కాలువ, స్లూయిజ్ నిర్మాణ పనులను ధ్వంసం చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రవితేజ ఖిలాడి, రామారావు సినిమా షూటింగ్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement