breaking news
ravi teja mother
-
హీరో రవితేజ తల్లిపై కేసు నమోదు
Police Case Filed On Actor Ravi Teja Mother, Details Inside: టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ తల్లిపై కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద పుష్కర కాలువను ధ్వంసం చేసిన కేసులో రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మితో పాటు మర్రిపాకకు చెందిన సంజయ్‌లపై కేసు నమోదైంది. సర్వే నంబర్ 108, 124లో పుష్కర కాలువ, స్లూయిజ్ నిర్మాణ పనులను ధ్వంసం చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రవితేజ ఖిలాడి, రామారావు సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. -
కీలక విషయాలు వెల్లడించిన హీరో రవితేజ తల్లి
హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంలో తన కుమారుడికి సంబంధం లేదని హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి తెలిపారు. మాదక ద్రవ్యాల కేసులో రవితేజ పేరు బయటకు రావడం తనకు బాధ కలింగించిందన్నారు. రవితేజకు ఎలాంటి దురలవాట్లు లేవని చెప్పారు. తన కొడుకు సిగరెట్ తాగడని, తాగేవాళ్లను ప్రోత్సహించడని ఆమె అన్నారు. రవితేజకు డ్రగ్స్ అలవాటు ఉందనడం అవాస్తమని, కావాలనే ఈ కేసులో అతడిని ఇరికిస్తున్నారని ఆరోపించారు. మద్యం మత్తులోనే తన రెండో కుమారుడు భరత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. చనిపోయే కొద్ది రోజుల ముందు భరత్ అన్ని దురలవాట్లు మానేశాడని వెల్లడించారు. భరత్ బిగ్‌బాస్ షోకు కూడా ఎంపికయ్యాడని తెలిపారు. కుటుంబ ఆచారం ప్రకారమే భరత్ అంత్యక్రియలకు హాజరుకాలేదన్నారు. తన తమ్ముడు చనిపోయిన తర్వాత నిర్మాతలకు నష్టం రాకూడదనే రవితేజ షూటింగ్‌కు వెళ్లాడని చెప్పారు. భరత్‌ను రవితేజతో ముడిపెట్టి చూడొద్దని రాజ్యలక్ష్మి వేడుకున్నారు. కాగా, డ్రగ్స్ కేసులో రవితేజకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నోటీసులు ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. దీన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ధ్రువీకరించలేదు.