సెప్టెంబరులో ఓజీ | Pawan Kalyan OG Release Date Announced | Sakshi
Sakshi News home page

సెప్టెంబరులో ఓజీ

May 26 2025 12:28 AM | Updated on May 26 2025 12:28 AM

Pawan Kalyan OG Release Date Announced

పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. ఈ చిత్రంలో ప్రియాంకా మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇమ్రాన్‌ హష్మి ఓ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. సుజిత్‌ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోందని తెలిసింది.

కాగా ‘ఓజీ’ని ఈ ఏడాది సెప్టెంబరు 25న విడుదల చేయనున్నట్లుగా ఆదివారం మేకర్స్‌ వెల్లడించారు. శ్రియా రెడ్డి, అర్జున్‌ దాస్‌ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement