‘ది ప్యారడైజ్‌’.. అంచనాలు పెంచేసిన సుబ్బలక్ష్మి! | The Paradise: Kayadu Lohar First Look Poster Released | Sakshi
Sakshi News home page

‘ది ప్యారడైజ్‌’.. సుబ్బలక్ష్మి వచ్చేసింది

Apr 11 2026 2:09 PM | Updated on Apr 11 2026 2:22 PM

The Paradise: Kayadu Lohar First Look Poster Released

దసరా లాంటి బ్లాక్‌ బస్టర్‌ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌తో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్‌’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నాని లుక్‌, ఆయా షేర్‌ పాట సోషల్‌లో దూసుకెళ్తున్నాయి. తాజాగా హీరోయిన్‌గా నటిస్తున్న కయాదు లోహర్‌ లుక్‌ని కూడా విడుదల చేశారు. కయాదు బర్త్‌ డే సందర్భంగా ఈ రోజు(ఏప్రిల్‌ 11) ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని రిలీజ్‌ చేస్తూ బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ఇందులో ఆమె సుబ్బలక్ష్మి పాత్రలో కనిపించబోతున్నట్లు పోస్టర్‌ ద్వారా వెల్లడించారు. 

‘వెండితెర పై వెలగని తార’ మా సుబ్బలక్ష్మిని  చూడండి అంటూ కయాదు పాత్రపై క్యూరియాసిటీ పెంచారు. శ్రీకాంత్‌ ఓదెల సినిమాలో హీరోయిన్‌కి చాలా ప్రాధన్యత ఉంటుంది.  దసరాలో కీర్తి సురేశ్‌ పోషించిన వెన్నెల పాత్ర ఏ రేంజ్‌లో పేలిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు సుబ్బలక్ష్మి పాత్ర కూడా అదే స్థాయిలో బలంగా ఉండబోతున్నట్లు పోస్టర్‌ చూస్తే అర్థమవుతుంది.  ఈ చిత్రం కయాదు ఓ మధ్యతరగతి యువతిగా కనిపించబోతునట్లు సమాచారం. ఇందులో నాని ‘జడల్‌’ అనే పాత్ర పోషిస్తున్నాడు. విలన్ శికంజ మాలిక్‌ పాత్రలో మోహన్‌ బాబు నటిస్తున్నాడు. ఆగస్ట్‌ 21న ఈ చిత్రం విడుదల కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement