
ఊహించని, ఊహకందని విషయాలను మనం చూడగలిగేది వెండితెర మీదే. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సన్నివేశాలతో ప్రేక్షకులను రక్తి కట్టించే దర్శకుల ఊహ మాత్రం ఎవరి ఊహకూ అందనిది. అటువంటి ఊహతోనే అల్లుకున్న కథ ఈ క్లీనర్ సినిమా. ఈ కథ లైన్ ఎంత చిన్నది గా ఉంటుందో కథ నడిచే తీరు మాత్రం అందనంత ఎత్తులో ఉంటుంది. గంటన్నర నిడివితో ఉన్న సినిమా ఓ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్.
అంతలా ఏముందీ కథలో ఓ సారి చూద్దాం. జోయే తన తమ్ముడు మైఖేల్ తో లండన్ లో ఓ అపార్ట్ మెంట్లో ఉంటుంది. మైఖేల్ ఆటిజమ్ వ్యాధి బారిన పడ్డ స్పెషల్ ఛైల్డ్, కాని మంచి టాలెంటెడ్ కిడ్. జోయే ఆర్మీలో పని చేసిన అమ్మాయి ఇప్పుడు మాత్రం పోషణ కోసం ఆగ్నియన్ యనర్జీ సంస్థ కి సంబంధించన బిల్డింగ్ లో క్లీనర్ గా చేస్తుంటుంది.
ఓ రోజు ఆ బిల్డింగ్ లో పెద్ద పార్టీ జరుగుతుంది. దాని కోసంగా వంద అంతస్తుల బిల్డింగ్ లోని పై ఫ్లోర్ అద్దాలు క్లీన్ చేయాలని జోయేకు టాస్క్ ఇస్తాడు మేనేజర్. తను ఆ పని చేస్తున్నపుడు తన తమ్ముడిని ఓ సూపర్ వైజర్ దగ్గర వదిలి పెట్టి జోయో గాల్లో వేలాడుతూ అద్దాలను క్లీన్ చేస్తుంటుంది. ఇంతలో బిల్డింగ్ లోకి కొందరు దుండగులు పెద్ద బాంబులు, తుపాకీలతో చొరబడి పార్టీలో ఉన్న విఐపీలనందరినీ తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు.
జోయే అద్దాలను క్లీన్ చేస్తూనే ఇదంతా గమనిస్తూ తన తమ్ముడి గురించి బెంగపడుతుంది. జోయే గాల్లోనుండి బిల్డింగులోకి రావాలన్నా సూపర్ వైజర్ తన రోప్ ని ఆపరేట్ చేయాలి. కాని దుండగులు ఆ సూపర్ వైజర్ ని చంపేసుంటారు. మరి జోయే అక్కడి నుండి బయటపడి తనను తనతో పాటు తన తమ్ముడిని రక్షించుకోగలదా అన్నదే సినిమా.
పైన చెప్పుకున్నట్టు ఈ సినిమా ఓ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. ముఖ్యంగా ఈ సినిమాలో జోయే చేసే స్టంట్స్ ఒళ్ళు గగుర్పొడిస్తాయి. అంతేకాదు కథలో చాలా ట్విస్టులతో నడుస్తూ ప్రేక్షకుడి మతి పోగొడుతుంది. ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా ఈ సినిమా తెలుగులోనూ లభ్యమవుతోంది. ఈ వీకెండ్ కి మంచి టైంపాస్ మూవీ. ఎంజాయ్ ది క్లీనింగ్ డన్ బై జోయే.