నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులు

Non Bailable Warrant To Balakrishnas Upcoming Movie Producer - Sakshi

బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా BB3. మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా BB3 సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సింహా, లెజెండ్ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. అయితే  ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఈయనపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఏడేళ్ల క్రితం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా నటించిన  'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాను రవీందర్‌ రెడ్డి నిర్మించారు.

ఈ సమయంలో తనను మోసం చేసి అగ్రిమెంట్‌ను లెక్కచేయకుండా వేరే వారికి రైట్స్‌అమ్మేశారని ఓ యూఎస్‌ డిస్ట్రిబ్యూటర్‌ ఆరోపించారు. తన వద్ద నుంచి తీసుకున్న 50 లక్షలను తిరిగి చెల్లించలేదని, దీని వల్ల తాను చాలా నష్టపోయానని పేర్కొంటూ రవీందర్‌రెడ్డిపై చీటింగ్‌ కేసు పెట్టారు. కొన్నాళ్లుగా జరుగుతున్న  వాదోపవాదాల అనంరం కేసు చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను  జారీ చేస్తూ ప్రతిపాడు మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 19న కోర్టుకు హాజరు పరచాలని ఆదేశాలు జారీ చేసింది.  గతంలో బోయపాటి దర్శకతం వహించిన జయ జానకీ నాయక చిత్రాన్ని రవీందర్‌ రెడ్డి నిర్మించారు. కాగా ప్రస్తుతం బాలకృష్ణ ఈయన నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  బాలయ్య సరసన  ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.

చదవండి : (మరోసారి అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన బాలయ్య)
(కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top