చిరంజీవి సినిమా టైటిల్‌తో కొత్త చిత్రం

New Film Rudraveena Update - Sakshi

బాలచందన్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన ‘రుద్రవీణ’ చిత్రం అప్పట్లో ఎంతసూపర్‌ హిట్‌ అయిందో అందరికి తెలిసిందే.అలాంటి టైటిల్ తో ఇప్పటి వరకు ఏ హీరో కూడా సినిమా తీసి మెప్పించిన దాఖలాలు లేవు.అయితే తాజాగా ఇప్పుడు అదే టైటిల్ తో ఇప్పటి తరానికి అనుగుణంగా ఒక కొత్త రకమైన రీవేంజ్ డ్రామాతో దర్శకుడు మధుసూదన్ రెడ్డి ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.  

రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల సినిమాస్ పతాకంపై శ్రీరామ్, ఎల్సా, శుభశ్రీ  హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రాన్ని  రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాత సినిమా టైటిల్ కు ఏ మాత్రం మచ్చ రానీవకుండా దానికి తగ్గట్టే ఇప్పటి తరానికి అనుగుణంగా ఒక కొత్త రకమైన రీవేంజ్ డ్రామాతో వస్తున్న ఈ సినిమాను కూడా ప్రేక్షకులను ఆదరించి అలరించేలా అనేక జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను రూపొందించా మని దర్శక, నిర్మాతలు చెపుతున్నారు.చిరంజీవి టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top