జగదీష్‌ థియేటర్స్‌కే వస్తాడు

Nani Tuck Jagadish was all set to release in theatre - Sakshi

‘‘టక్‌ జగదీష్‌’ చిత్రం ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారంలో వాస్తవం లేదు. థియేటర్లలోనే రిలీజ్‌ చేస్తాం’’ అని చిత్రబృందం స్పష్టం చేసింది. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘టక్‌ జగదీష్‌’. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటించారు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది.

అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందనే వార్తలు వచ్చాయి. దీనిపై చిత్రబృందం స్పందిస్తూ– ‘‘టక్‌ జగదీష్‌’ ఓటీటీలో రిలీజ్‌ కానుందనే వార్తలు అవాస్తవం. ఇది పూర్తిగా థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ కోసం రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాక సినిమా విడుదల తేదీ చెబుతాం’’ అని పేర్కొంది. ఈ చిత్రా నికి: ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌. వెంకటరత్నం (వెంకట్‌). 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top