Nani-Nazriya Nazim: ‘మే 9న అంటే సుందరానికి’ నుంచి లవ్‌ట్రాక్

Nani Ante Sundaraniki Movie Latest Update: నేచురల్ స్టార్ నాని, మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ జంటగా నటిస్తున్న చిత్రం అంటే సుందరానికీ. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక ఫస్ట్‌సింగిల్ పేరుతో విడుదలైన పంచెకట్టు సాంగ్ సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి మరో సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇందుకు సంబంధించి అప్‌డే ఇచ్చింది చిత్రం బృందం.
చదవండి: ఉపాసన.. నా మైండ్‌లోనూ అదే ఉంది, కానీ మనం కొద్ది రోజులు ఆగాల్సిందే!
ఈ సందర్భంగా అంటే సుందరానికి సెకండ్ సింగిల్ ఎంత చిత్రం’ లవ్ ట్రాక్‌ను మే 9న విడదుల కానుందని స్పష్టం చేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో హీరోహీరోయిన్లు బస్సులో కుర్చుని ఉండగా.. నాని, నజ్రియా భుజంపై తలవాల్చి కనిపించాడు. తన చేతితో నాని తలను అడ్డు పెట్టిన నజ్రియా చిరు నవ్వులు చిందిస్తూ కనిపించింది. మత ఆచారాలకు కట్టుబడి ఉండే ఇరు కుటుంబాలను ఒప్పించడానికి హీరోహీరోయిన్లు ఎన్ని తిప్పలు పడ్డారు? అసలు వీరి పెళ్లి జరిగిందా? లేదా? అన్నదే ఈ సినిమా కథ. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ జూన్ 10న థియేటర్లలో రిలీజవుతోంది.
Our next single #EnthaChithram from #AnteSundaraniki will dazzle your ears and leave you “in love”…
Releasing on May 9th 🎧❤️#AnteSundaranikiOnJune10th
Natural ⭐ @NameisNani #NazriyaFahadh #VivekAthreya @oddphysce @nikethbommi @saregamasouth pic.twitter.com/MWoTGe0uvp
— Mythri Movie Makers (@MythriOfficial) May 6, 2022