Veera Simha Reddy Trailer: 'పుట్టింది పులిచర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్'..వీరసింహారెడ్డి ట్రైలర్ అవుట్

Nandamuri Balakrishna Movie Veerasimhareddy Trailer Out Today - Sakshi

అఖండ విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. ఇందులో శృతిహాసన్‌ కథానాయికగా నటించింది. బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్‌ వచ్చేసింది. ఇవాళ ఒంగోలులో జరగుతున్న ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. 

'సీమలో ఏ ఒక్కడు కత్తి పట్టకూడదని నేనే కత్తి పట్టా.. పరపతి కోసమో.. పెత్తనం కోసమో కాదు' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తే రాయలసీమ నేపథ్యంలో ఫ్యాక్షన్‌ ఫైట్స్ అభిమానులను అలరించనున్నాయి. 'పుట్టింది పులిచర్ల.. చదివింది అనంతపురం.. రూలింగ్ కర్నూల్' అనే డైలాగ్ హైలెట్‌గా నిలవనుంది. ట్రైలర్ చూస్తే సీమ నేపథ్యంలోనే సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బాలయ్య పవర్‌ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మించారు. సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది ఈ చిత్రం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top