‘వైల్డ్‌డాగ్‌’ తెర వెనుక కథ వీడియో వైరల్‌ | Nagarjuna Wild Dog Making Video: Behind The Hunt Part 1 Released | Sakshi
Sakshi News home page

‘వైల్డ్‌డాగ్‌’ తెర వెనుక కథ వీడియో వైరల్

Apr 1 2021 1:43 PM | Updated on Apr 1 2021 4:30 PM

Nagarjuna Wild Dog Making Video: Behind The Hunt Part 1 Released - Sakshi

అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వైల్డ్‌డాగ్‌’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా శుక్రవారం(ఏప్రిల్‌ 2)న విడుదలవుతోంది. వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన ఈ చిత్రంలో కింగ్‌ నాగ్‌  ఏసీపీ విజయ్‌ వర్మగా నటించాడు. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో మూవీ ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచేసింది చిత్రబృందం. గత చిత్రాలకు భిన్నంగా నాగ్‌ ‘వైల్డ్‌డాగ్‌’ ప్రమోషన్స్‌ చేస్తున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే ‘వైల్డ్ డాగ్ పుష్ అప్ ఛాలెంజ్’’ పేరుతో సినీ ప్రముఖులకు పుష్‌ అప్‌ చాలెంజ్‌ విసిరాడు. ఇక తాజాగా ‘వైల్డ్‌ డాగ్‌’ వెండితెరపై కనిపించేందుకు చిత్రబృందం ఎంత కష్టపడిందో వివరిస్తూ ఓ వీడియోను ప్రేక్షకులతో పంచుకున్నారు. తెర వెనుక క‌థ అంటూ నాగార్జున‌, నిరంజ‌న్ రెడ్డి, అహిషోర్, దియా మీర్జా, సయామీ ఖేర్‌, అలీరెజా, అతుల్‌ కులకర్ణి వంటి నటులు త‌మ అనుభ‌వాల‌ను వివ‌రించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అయింది.

చదవండి:
వారి వల్లే స్టార్‌ అయ్యా: నాగార్జున  
మహేశ్ బాబు‌ నిర్మాతగా మరో క్రేజీ ప్రాజెక్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement