Mukku Avinash and Anuja Home Tour Video Viral- Sakshi
Sakshi News home page

Mukku Avinash: ముక్కు అవినాష్‌ అందమైన ఇంటిని చూసేయండి..

Jan 3 2022 8:59 AM | Updated on Jan 3 2022 4:09 PM

Mukku Avinash and Anuja Home Tour Video - Sakshi

పుట్టబోయే పిల్లల కోసం, ఇంటికి వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన మరో రెండ్‌ బెడ్‌ రూమ్స్‌ను సైతం చూపించాడు. వారి అభిరుచికి తగ్గట్లుగా థీమ్‌ పోస్టర్‌లను ఆయా గదుల్లో అతికించారు.

Mukku Avinash Shares Home Tour Video: కామెడీ షోలో ప్రేక్షకుల పెదాలపై నవ్వులు పూయించిన ముక్కు అవినాష్‌ బిగ్‌బాస్‌ షోతో వారికి మరింత దగ్గరయ్యాడు. బిగ్‌బాస్‌ తెలుగు నాల్గో సీజన్‌లో పాల్గొన్న అతడు కంటెస్టెంట్లందరితో కలిసిపోతూనే వారిని సరదాగా ఓ ఆటాడిస్తూ ఫుల్‌ కామెడీ చేసి జనాలను తెగ నవ్వించాడు. బుల్లితెరపై కమెడియన్‌గానే కాకుండా సినిమాల్లో నటుడిగానూ రాణిస్తున్నాడు. ఇటీవల అవినాష్‌ పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. ఈ క్రమంలో భార్య అనుజతో కలిసి యూట్యూబ్‌ వీడియోలు, రీల్స్‌, ఫొటోషూట్స్‌ అంటూ తెగ సందడి చేస్తున్నాడు. తాజాగా అతడు తన ఇంటిని ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశాడు. సుమారు ఏడేళ్ల కష్టపడ్డ అనంతరం ఆ డబ్బుతో ఇల్లు, కారు కొనుక్కున్నానని తెలిపాడు. తనది ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ హౌస్‌ అంటూ ఇల్లు మొత్తాన్ని కెమెరాలో బంధించాడు.

స్కూల్‌ఫ్రెండ్‌ జగదీశ్‌ తన ఇంటికి ఇంటీరియర్‌ డిజైన్‌ చేశాడన్న అవినాష్‌ తనకు వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను చూపిస్తూ వాటి వెనక స్టోరీని వెల్లడించాడు. బాల్కనీ, కిచెన్‌, డైనింగ్‌ టేబుల్‌, పూజా గది, బెడ్‌ రూమ్‌.. ఇలా అన్నింటినీ చూపించాడు. పుట్టబోయే పిల్లల కోసం, ఇంటికి వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన మరో రెండ్‌ బెడ్‌ రూమ్స్‌ను సైతం చూపించాడు. వారి అభిరుచికి తగ్గట్లుగా ఆయా గదుల్లో థీమ్‌ పోస్టర్‌లను అతికించారు. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. మీ జంట చూడముచ్చటగా ఎలా ఉందో మీ హౌస్‌ కూడా అంతే బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement
 
Advertisement
Advertisement