రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసు: జాక్వెలిన్‌కు బిగుస్తున్న ఉచ్చు.. | Money Laundering Case: Delhi Court Summons Jacqueline Fernandez | Sakshi
Sakshi News home page

Jacqueline Fernandez: రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌కు బిగుస్తున్న ఉచ్చు.. నోటీసులు జారీ చేసిన కోర్టు

Published Wed, Aug 31 2022 6:23 PM | Last Updated on Wed, Aug 31 2022 8:42 PM

Money Laundering Case: Delhi Court Summons Jacqueline Fernandez - Sakshi

రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా ఆమెకు డిల్లీ పాటియాల హౌజ్‌ కోర్టు షాకిచ్చింది. సెప్టెంబర్‌ 26వ తేదీన కోర్టులో హాజరు కావాలని జాక్వెలిన్‌ను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు కోర్టు ఆమెకు సమాన్లు ఇచ్చింది. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పరిగణించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఇటీవల జాక్వెలిన్‌పై ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్‌ చంద్రశేఖర్‌పై న‌మోదు చేసిన స‌ప్లిమెంట‌రీ ఛార్జ్‌షీట్‌లో జాక్వెలిన్ పేరును చేర్చింది ఈడీ. ఈ ఛార్జ్‌షీట్‌ను ఈడీ కోర్టులో సమర్పించగా దాని ఆధారంగా తాజాగా కోర్టు జాక్వెలిన్‌కు సమాన్లు జారీ చేసింది.

చదవండి: సుమన్‌ ఇకలేరంటూ వార్తలు.. ఆ యూట్యూబ్‌ చానళ్లకు నటుడు వార్నింగ్‌

కాగా రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లను రూ.200 కోట్లకు మోసం చేసిన కేసులో సుకేశ్‌ చంద్రశేఖర్‌ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతనితో జాక్వెలిన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. అతని నుంచి ఖరీదైన బహుమతులను పొందినట్లు గుర్తించారు. ఇప్పటికే జాక్వెలిన్‌కు చెందిన రూ.7.27 కోట్ల ఆస్తులను  ఈడీ అటాచ్‌ చేసింది. అయితే.. ఈడీ‌ అటాచ్‌ చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తన కష్టార్జితమని జాక్వెలిన్‌ ఇప్పటికే స్పష్టం చేసింది. తన సంపాదనకు సంబంధించి ఆదాయపు పన్ను కూడా చెల్లించానని, క్రైమ్‌ ప్రొసీడింగ్స్‌ను నిలిపి వేయాలని జాక్వెలిన్‌ ఈడీని కోరిన సంగతి తెలిసిందే.

చదవండి: 
యాంకర్‌ సుమ పెళ్లి చీర ధరెంతో తెలుసా? అదే ఆమె రేంజ్‌ అట
నటుడు బ్రహ్మాజీ సటైరికల్‌ ట్వీట్‌.. అనసూయను ఉద్ధేశించేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement