ప్రభాస్ ‘సలార్‌’లో మిస్ ఇండియా మీనాక్షి చౌదరి?

Miss India Meenakshi got a role in Prabhass Salaar - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కేజీఎఫ్‌’ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో చేస్తున్న మూవీ ‘సలార్‌’. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రెబల్‌ స్టార్‌ సరసన శృతి హాసన్ ఇప్పటికే హీరోయిన్ గా నటిస్తున్నప్పటికీ, మరో హీరోయిన్‌ వేటలో ఉంది మూవీ టీం.

అయితే తాజాగా ఈ సినిమాలో రెండో హీరోయిన్‌ పాత్రకు 2018 మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ హోల్డర్ మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్లు ఫిలీం సర్కిల్‌లో ప్రచారం సాగుతోంది. సినిమా నెక్ట్‌ షెడ్యూల్‌లో ‘సలార్‌’ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదేగనక నిజమైతే ఈ బ్యూటీ నక్క తోక తొక్కినట్లేనని సినీ జనాలు అనుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే తెలుగులో లైమ్‌లైట్‌లోకి వస్తున్న ఈ భామకి ప్రభాస్‌ సరసన చేసే అవకాశం వస్తే అంతకంటే అదృష్టం లేదనే చెప్పాలి.

అయితే ఈ బ్యూటీ నటించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ విడుదలై మంచి టాక్‌ తెచ్చుకోగా, ప్రస్తుతం ‘ఖిలాడీ’, ‘హిట్‌-2’ సినిమాలు చేస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ‘సలార్‌’ 2022 చివరికల్లా విడుదల చేసేలా రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

చదవండి: బెస్ట్‌ బిర్యానీ పంపినందుకు థ్యాంక్యూ ప్రభాస్‌.. వైర‌లవుతున్న క‌రీనా పోస్ట్

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top