​‍​‍​మున్నా అంటే అర్థం అదా ? షేర్‌ చేసిన మున్నా భయ్యా | Mirzapur Actor Divyenndu Aka Munna Bhaiya Funniest Act | Sakshi
Sakshi News home page

​‍​‍​Mirzapur Actor Divyenndu Aka Munna Bhaiya: 'మున్నా' అంటే అర్థం అదా ? షేర్‌ చేసిన మున్నా భయ్యా

Nov 26 2021 6:06 PM | Updated on Nov 26 2021 6:07 PM

Mirzapur Actor Divyenndu Aka Munna Bhaiya Funniest Act - Sakshi

Mirzapur Actor Divyenndu Aka Munna Bhaiya Funniest Act: బాలీవుడ్ నటుడు దివ‍్యేందు శర్మ అంటే పెద్దగా ఎవరికీ తెలీదు. కానీ 'మున్నా భయ‍్యా' అంటే మాత్రం అందరికీ తెలుసు. తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు దివ్యేందు. అన్నిటికిమించి 'మీర్జాపూర్‌ సిరీస్‌'ల్లోని 'మున్నా త్రిపాఠి' పాత్ర అంటే అది వేరే లెవెల్‌. అతనికి ఈ పాత్రతో ఫ్యాన్స్‌ కూడా హైలెవెల్‌గానే పెరిగిపోయారు. అంతలా యూత్‌కి కిక్‌ ఇచ్చింది అతడి నటన. తాజాగా దివ్వేందు సోషల్‌ మీడియాలో వస్తున్న అర్బన్‌ డిక్షనరీ ట్రెండ్‌పై సరదాగా స్పందించాడు. అర్బన్‌ డిక్షనరీలో తన అసలు పేరుకు బదులు 'మున్నా' అనే పేరుకు అర్థం వెతికాడు. దానికి అర్బన్‌ డిక్షనరీ వెబ్‌సైట్‌ ఇచ్చిన అర్థాన్ని స్క్రీన్‌షాట్‌ తీసి తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్‌ చేశాడు. అలాగే మున్నా అనే పేరుకు వచ్చిన అర్థాన్ని 'అమెజాన్‌ ప్రైమ్‌' కూడా షేర్‌ చేయడాన్ని దివ్యేందు తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. 

'మీర్జాపూర్‌కు రాజు కావాలని పరితపించే వ్యక్తి ఎప్పుడూ తన తండ్రి ఆమోదం కోసం ఎదురుచూస్తుంటాడు. జీవితం మున్నా భయ్యా లాంటిది.' అని అర్బన్ డిక్షనరీ 'మున్నా' పేరుకు అర్థం తెలిపింది. దివ్వేందును అతడి అభిమానులు మున్నా భయ్యా అనే పిలుస్తారు. భారతీయులు అత్యంత ఇష్టపడే పాత్రలలో ఒకటి మున్నా భయ్యా పాత్ర. ఈ పాత్రలో దివ్యేందు అద్భుత నటన ఎప్పటికీ గుర‍్తుండిపోతుంది. 'ప‍్యార్‌ కా పంచ్‌నామా'లో ఒక పక్కింటి కుర్రాడి పాత్ర నుంచి 'మీర్జాపూర్‌'లో గూండా వరకు తనదైనా నటనతో ఆకట్టుకున్నాడు దివ్యేందు. ప‍్రస్తుతం దివ్యేందు వివిధ ప్రాజెక్టులకు సంతకం చేసినట్లు ప్రచారం ఉంది. వాటిని త్వరలోనే ప్రకటిస్తారాని సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement