మెగాస్టార్ మన శంకర వరప్రసాద్‌ గారు.. తెలుగు సినీ చరిత్రలో తొలిసారి! | Chiranjeevi and Venkatesh Team Up for the First Time in “Mana Shankara Vara Prasad Garu” – Fans Go Crazy! | Sakshi
Sakshi News home page

Chiranjeevi : మెగాస్టార్ మన శంకర వరప్రసాద్‌ గారు.. తెలుగు సినీ చరిత్రలో తొలిసారి!

Oct 23 2025 2:33 PM | Updated on Oct 23 2025 3:02 PM

Megastar Chiranjeevi Tweet On Mana Shankara VaraPrasad Garu MOvie

మెగాస్టార్ - అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న ఈ మూవీపై రోజు రోజుకు అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజైన మీసాల పిల్ల సాంగ్‌ ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది. మొదటిసారి వీరిద్దరి మూవీ కోసం టాలీవుడ్‌ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఫుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌ మన శంకర వరప్రసాద్‌ గారుకి సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది.

ఈ మూవీలో వెంకీమామ సైతం నటిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని మెగాస్టార్‌((Chiranjeevi) ) సైతం ట్వీట్ చేశారు. వెల్‌కమ్‌ టూ మన శంకర వరప్రసాద్‌ గారు ఫ్యామిలీ అంటూ వీడియోను పంచుకున్నారు. ఈ వీడియోలో వెంకటేశ్‌ను చిరంజీవి మై బ్రదర్‌ అని పిలవగా.. చిరుసర్‌.. మై బాస్‌ అంటూ వెంకీ మామ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఇద్దరు స్టార్‌ హీరోలు ఓకే మూవీలో నటించడం తెలుగు సినీ చరిత్రలో ఇదే మొదటిసారి అంటూ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement