Masooda Movie Release Date Confirmed, Check Deets Inside - Sakshi
Sakshi News home page

Masooda Movie Update: పాన్‌ ఇండియా చిత్రంగా 'మసూద'

Sep 30 2022 2:34 PM | Updated on Sep 30 2022 3:51 PM

Masooda Movie To Release On 21st November - Sakshi

‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్‌ల తర్వాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పటికే తన మూడో సినిమా ‘మసూద’ను ప్రకటించింది.  హారర్-డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన  ఈ చిత్రం  నవంబర్ 11న విడుదల కానుంది.

ఈ సందర్భగా చిత్ర నిర్మాత రాహూల్ యాదవ్ నక్క మాట్లాడుతూ ‘మనం ఒక మంచి హారర్ డ్రామాను చూసి చాలా కాలం అయ్యింది. మంచి హార్రర్ చిత్రాలలో  మసూద ఒకటిగా నిలుస్తుందని నా గట్టి నమ్మకం.  ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్‌కి, పోస్ట‌ర్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, త‌మిళంలో కూడా ఒకేసారి విడుద‌ల చేయ‌డానికి  ప్లాన్ చేస్తున్నాం.  అతి త్వరలో ఇతర  వివరాలను తెలియజేస్తాం.  అన్నారు. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, అఖిలా రామ్, బాంధవి శ్రీధర్, సత్యం రాజేష్, సత్య ప్రకాష్, సూర్యారావు, సురభి ప్రభావతి, కృష్ణతేజ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement