Manchu Manoj: సినిమా స్టైల్‌లో మనోజ్‌-మౌనికల పెళ్లి.. ఆరోజు అతిథిలా..ఇప్పుడెమో ఇలా

Manchu Manoj Who Attended Mounika Reddy First Marraige Now Marraying Her - Sakshi

మంచు వారి ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. అందరూ అనుకున్నట్లుగానే మంచు మనోజ్‌ మౌనిక రెడ్డిని వివాహం చేసుకోనున్నారు. ఈరోజు(శుక్రవారం)8.30 నిమిషాలకు వీరు పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని మంచు లక్ష్మీ ఇంట్లోనే పెళ్లి వేడకు జరగనుంది. ఇప్పటికే మనోజ్‌ తన పెళ్లి విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. కాబోయే భార్య ఫోటోను షేర్‌ చేస్తూ.. మనోజ్‌ వెడ్స్‌ మౌనిక అంటూ పెళ్లిపై ప్రకటన చేశాడు.

ఇప్పటికే మెహందీ, సంగీత్‌ సహా ప్రీవెడ్డింగ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగినట్లు తెలుస్తుంది. ఇరు కుటుంసభ్యులతో పాటు అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో మనోజ్‌ వివాహం జరగనుంది. చాలాకాలం నుంచే మంచు కుటుంబానికి భూమా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మనోజ్‌-మౌనికల మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. అంతేకాకుండా 2015లో మౌనిక రెడ్డి మొదటి పెళ్లికి కూడా మనోజ్‌ హాజరయ్యారు. అలాంటిది ఇప్పుడు ఆమెనే మనువాడబోతుండం విశేషం.

ఇద్దరికీ ఇది రెండో పెళ్లి.  గతంలో మంచు మనోజ్ కు ప్రణతి రెడ్డితో పెళ్లి జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమెతో విడాకులు తీసుకున్నాడు. మౌనిక రెడ్డి కూడా బెంగళూరుకు చెందిన బిజినెస్‌ మ్యాన్‌ గణేష్‌ రెడ్డిని వివాహం చేసుకోగా మనస్పర్థల కారణంగా భర్తతో విడిపోయింది. కొంతకాలంగా మనోజ్‌- మౌనికలు రిలేషన్‌లో ఉండగా ఇప్పుడు పెల్లిబంధంతో ఒక్కటి కానున్నారు.

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top