Manchu Lakshmi: డీజే టిల్లుతో మంచు లక్ష్మీ మాస్ డ్యాన్స్.. వీడియో వైరల్

Manchu Lakshmi And Dj Tillu Mass Steps: మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. వ్యక్తిగత విషయాలతో పాటు ప్రొఫెషనల్ అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు ఫన్నీ వీడియోలు, డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంటారు. తాజాగా ఆమె చేసిన ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
డీజే టిల్లు మూవీలోని ఫేమస్ మాస్ సాంగ్ టిల్లు అన్నా డీజే పెడితే.. అంటూ సాగే పాటకి అదే లెవల్‌లో ఊరమాస్ స్టెప్పులేసింది. ఇందులో మంచు లక్ష్మీతో కలిసి హీరో సిద్దు, అమన్ చిందులేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది.