తెలుగబ్బాయికి నిరాశ.. 'ఇండియన్ ఐడల్' విజేతగా మానసి | Manasi Ghosh Wins Indian Idol 15 Title | Sakshi
Sakshi News home page

Indian Idol 15: విజేతగా బెంగాలీ అమ్మాయి.. ఏమేం ఇచ్చారంటే?

Apr 7 2025 3:13 PM | Updated on Apr 7 2025 3:54 PM

Manasi Ghosh Wins Indian Idol 15 Title

సింగింగ్ రియాలటీ షోల్లో 'ఇండియన్ ఐడల్'(Indian Idol 15)కు మంచి క్రేజ్ ఉంది. తెలుగువాళ్లు దాదాపు ప్రతి సీజన్ లోనూ పాల్గొంటూనే ఉంటారు. తాజాగా పూర్తయిన 15వ సీజన్ లోనూ అనిరుధ్ అనే తెలుగు కుర్రాడు పాల్గొన్నాడు. ఫైనల్ వరకు వచ్చాడు కానీ నిరాశే మిగిలింది. బెంగాలీ అమ్మాయి విజేతగా నిలిచింది.

(ఇదీ చదవండి: తారక్ కి ప్రేమతో.. సుకుమార్ ఇంట్లో ఎన్టీఆర్)

గతేడాది అక్టోబరులో మొదలైన ఇండియన్ ఐడల్-15.. నిన్నటితో(ఏప్రిల్ 6) ముగిసింది. పశ్చిమ బెంగాల్ కి చెందిన మానసి ఘోష్ (Manasi Ghosh) విజేతగా నిలిచింది. ఈమెకు ట్రోఫీతో పాటు రూ.25 లక్షల ప్రైజ్ మనీ, కొత్త కారు బహుమతిగా ఇచ్చారు. రన్నరప్స్ గా నిలిచింది చక్రవర్తి, స్నేహా శంకర్ కి చెరో రూ.5 లక్షలు ఇచ్చారు.

ఈ సీజన్ లో కర్నూలుకి చెందిన అనిరుధ్ సుస్వరం (Anirudh Suswaram) అనే కుర్రాడు పాల్గొన్నాడు. ఫైనల్ వరకు వచ్చాడు గానీ ఆరో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో ఆహా ఓటీటీలో ప్రసారమైన తెలుగు ఇండియన్ ఐడల్ లో పాల్గొన్న అనిరుధ్.. తొలి రన్నరప్ గా నిలిచాడు.

(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు ఆంథాలజీ సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement