జ్వాలాబాయిగా మమతా మోహన్‌ దాస్‌..  ఆకట్టుకుంటున్న పోస్టర్‌ | Sakshi
Sakshi News home page

Mamata Mohandas : జ్వాలాబాయిగా మమతా మోహన్‌ దాస్‌..  ఆకట్టుకుంటున్న పోస్టర్‌

Published Sun, Oct 23 2022 10:33 AM

Mamata Mohandas As Jwalabhai Dhorasani In Rudrangi - Sakshi

ఎం.ఎల్.ఏ,  రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ లో  భారీ స్థాయిలో నిర్మిస్తున్న సినిమా 'రుద్రంగి'. రాజన్న, బాహుబలి, బాహుబలి2, ఆర్. ఆర్.ఆర్, అఖండ చిత్రాలకు రైటర్‌గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన ప్రీ- అనౌన్సెమెంట్ పోస్టర్, జగపతి బాబు లుక్ కు మంచి స్పందన వస్తోంది. ఆయన ఈ చిత్రంలో 'భీమ్ రావ్ దొర' గా కనిపించనున్నారు.

ఇక తాజాగా 'రుద్రంగి' సినిమా నుంచి మమతా మోహన్ దాస్ నటిస్తున్న జ్వాలాబాయి దొరసాని పాత్రను ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు.ఈ మోషన్ పోస్టర్ లో జ్వాలాబాయి దొరసాని పాత్రలో మమతా మోహన్ దాస్ చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. 'నువ్వు దొర అయితే నేను దొరసానిని తగలబెడతా, ఛల్ హట్' అంటూ ఆమె చెప్పిన డైలాగ్స్ మాస్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి.

జగపతి బాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలా రామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్, సదానందం తదితరులు కీలకపాత్రల్లో కనిపించన్నునారు. సంతోష్ శనమోని సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ మరియు నాఫల్ రాజా ఐఏఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement