Mahesh Babu Introduces The Doctor Behind His Health And Fitness - Sakshi
Sakshi News home page

Mahesh Babu మహేశ్‌ బాబుకు ఏమైంది? ఆరోగ్యంపై ఎందుకలా పోస్ట్‌ చేశారు?

Apr 16 2023 1:31 PM | Updated on Apr 16 2023 2:35 PM

Mahesh Babu Introduces The Doctor Behind His Health And Fitness - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ఫిట్‌నెస్‌ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాలుగు పదుల వయసు దాటినా ఇంకా పాతికేళ్ల కుర్రాడిలా మెస్మరైజ్‌ చేస్తాడు. హాలీవుడ్‌ హీరోలా తన చార్మింగ్‌నెస్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. కఠినమైన డైట్‌ ఫాలో అయ్యే మహేశ్‌బాబు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

భార్య, పిల్లలతో వారం రోజులుగా జర్మనీలో గడుపుతున్నారు.అయితే తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించిన మహేశ్‌ షేర్‌ చేసిన ఓ పోస్ట్‌ అభిమానులను కలవర పెడుతుంది. డాక్టర్ హ్యారీ కోనిగ్‌తో దిగిన ఓ ఫోటోను షేర్‌ చేస్తూ..'థ్యాంక్యూ డాక్టర్ హ్యారీ కోనిగ్! ఆరోగ్యం మెరుగైన చేతుల్లో'.. అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. ఇది చూసి మహేశ్‌కు ఏమైంది?ఆయన అస్వస్థతకు గురైతే  డాక్టర్ హ్యారీ నయం చేశారా అంటూ ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.

అయితే ఇందులో కంగారు పడాల్సిన పని లేదని తెలుస్తుంది. గత ‍కొన్నాళ్లుగా నేచురోపతి డాక్టర్ హ్యారీ కోనిగ్‌ ఆద్వర్యంలో మహేశ్‌ చికిత్స తీసుకుంటూ ఇలా ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నారట. అందుకే డాక్టర్ సేవలను అభినందిస్తూ మహేశ్‌ ఈ పోస్ట్‌ను షేర్‌ చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement