చక్రసిధ్‌ కేంద్రాన్ని ప్రారంభించిన మహేశ్‌ దంపతులు

Mahesh Babu And His Wife Namrata Shirodkar Starts Chakrasiddh Center In Hyderabad - Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌‌ బాబు, నమ్రత శిరోద్కర్‌ దంపతులు పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతూ పేదవారికి అండగా నిలుస్తున్నారు. ట్రస్ట్‌లు, ఫౌండేషన్‌ ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు. ఇప్పటికే  ఆంధ్రప్రదేశ్‌లోని రెయిన్‌బో హాస్పిటల్‌తో కలిసి ఎంతోమంది చిన్నారులకు హార్ట్‌ ఆపరేషన్‌ చేయిస్తున్నారు. తాజాగా సూపర్‌ స్టార్‌ దంపతులు తమ సేవ కార్యక్రమాల్లో మరో ముందడుగు వేశారు. హైదరాబాద్‌లోని శంకర్‌పల్లి సమీపంలో మోకిల వద్ద చక్రసిధ్‌ అనే హెల్త్‌కేర్‌ సెంటర్‌ను ప్రారంభించారు. శాంత బయోటెక్నిక్స్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి, గేయ రచయిత  సిరివెన్నెల సీతారామ శాస్త్రి,  యాంకర్ సుమ రాజీవ్ కనకాల దంపతులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ.. సిద్ధ వైద్యం ఒక అద్భుత చికిత్స ప్రామాణికమైనది. ప్రాచీనమైన, సాంప్రదాయమైన దీనిని ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది కేవలం వ్యాధిని నయం చేసే పద్ధతి మాత్రమే కాదు, మన మొత్తం జీవనశైలిని మార్చడంలో ఇది మనకు సహాయపడుతుంది అన్నారు. డాక్టర్ సత్య సింధుజ చక్రసిద్ధ్‌ నాది వైద్యంలో నిపుణురాలు. దీని ద్వారా ఏదైనా వ్యాధిని నయం చేయవచ్చు. డా. సింధూజ సూచనల ప్రకారం  పద్ధతులను పాటిస్తే, మనం అద్భుతాలను చూడవచ్చు. మన జీవనశైలిని కూడా సరిగ్గా సెట్ చేసుకోవచ్చని మహేష్ బాబు అన్నారు.

డాక్టర్‌ సింధుజ మాట్లాడుతూ..  చక్రసిద్ధం నొప్పిలేని  జీవితాన్ని గడపాలని కోరుకునే వారికి అనువైన ప్రదేశం అని డాక్టర్ భువనగిరి సత్య సింధుజ అన్నారు ఇది తమ బాధలను అంతం చేసి నొప్పి లేని జీవితాన్ని గడపడాలని అనుకునేవారికి ఈ సిద్ద వైద్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. యోగి సైన్స్ మద్దతుతో, సిద్ధ హీలింగ్, 4000 సంవత్సరాల పురాతనమైనది, మానవ ఉనికి, భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక అంశాలలో స్థిరమైన సమతుల్యతను వెలిగిస్తుంది అని ఆమె పేర్కొన్నారు. ఈ చక్రసిధ్‌ వైద్యం ద్వారా మానవ శరీరంలో 72,000 శక్తి మార్గాలు ఉన్నాయి. ప్రెజర్ పాయింట్ల ద్వారా శక్తి ప్రవాహాన్ని పరీక్షించడం దీర్ఘకాలిక నొప్పి, వ్యాధులను ఈ చక్రసిధ్‌ వైద్యం ద్వారా నయం చేయడం జరుగుతుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top