
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అధ్యక్ష బరిలో నేను ఉన్నానంటే..నేను ఉన్నానంటూ రోజుకో వ్యక్తి మీడియా ముందుకు వస్తున్నారు. అధ్యక్ష రేసులో ఇప్పటికే ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు ఉన్నామని ప్రకటించారు. ఇక మరో నటుడు ఓ. కల్యాణ్ కూడా ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా దీనిపై ఓ. కల్యాణ్ క్లారిటీ ఇచ్చాడు.
తాను ‘మా’ఎన్నికల్లో ఏ పదవికి పోటీ చేయడం లేదని, ఎవరికి మద్దతు ప్రకటించబోనని స్పష్టం చేశాడు. మా ఎన్నికల వివాదంపై మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించాడు. ఈ సందర్భంగా కల్యాణ్ మాట్లాడుతూ.. 15 ఏళ్ల నుంచి ‘మా’లో అలజడి తప్ప అభివృద్ధి లేదని ఆరోపించారు. ఎన్నికల ప్రకటన రాకుండానే ప్రకాశ్ రాజ్ ఎందుకు ముందుకు వచ్చారని ప్రశ్నించారు. అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకునేలా సినీ పెద్దలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ముందుకు వచ్చి మా' అసోసియేషన్‌ను కోమా నుంచి బయటపడేయాలని కోరాడు.
చదవండి:
సెటైర్: మా ఎన్నికల కోసం చైనా అధ్యక్షుడు!!
మా ఎన్నికలు: సీవీఎల్ నరసింహారావుకు విజయశాంతి మద్దతు