విడాకులిచ్చి ఏడాది కాలేదు.. కమెడియన్‌తో డేటింగ్‌ చేస్తున్న స్టార్‌ నటి | Is Kusha Kapila Dating With Star Comedian Anubhav Singh Bassi After Divorce With Zorawar? - Sakshi
Sakshi News home page

విడాకులిచ్చి ఏడాది కాలేదు.. కమెడియన్‌తో డేటింగ్‌ చేస్తున్న స్టార్‌ నటి

Apr 19 2024 11:23 AM | Updated on Apr 19 2024 12:08 PM

Kusha Kapila Dating With Star Comedian - Sakshi

బాలీవుడ్ నటి 'కుషా కపిల' సోషల్ మీడియాతో విపరీతమైన స్టార్‌డమ్‌ తెచ్చుకున్నారు. కామెడీ కంటెంట్‌తో చిన్న చిన్న వీడియోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఆ తర్వాత సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌‍ల్లోనూ నటించారు. అనంతరం 2017లో కుషా కపిల.. జోరావర్ సింగ్ అహ్లువాలియాను పెళ్లి చేసుకున్నారామె. అయితే వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2023లో విడిపోయారు.


(మాజీ భర్త జోరావర్ సింగ్ అహ్లువాలియాతో కుషా కపిల)

బాలీవుడ్‌ జంట కుషా కపిల, జొరావర్‌ సిగ్‌ అహ్లువాలియా  విడిపోయిన తర్వాత వారి అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. దీంతో ఆమెపై కొందరు తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. ఆమె క్యారెక్టర్‌ను తప్పు పడుతూ అసభ్య రీతిలో కామెంట్లు కూడా చేశారు. దీంతో అదే సమయంలో ఆమె భర్త జొరావర్‌ సిగ్‌ అహ్లువాలియా కలుగచేసుకుని ఆమెపట్ల ఇలాంటి కామెంట్లు వద్దని వారించాడు. ఇద్దరం కలిసే విడిపోయాం. ఇందులో ఆమెది మాత్రమే తప్పు కాదు అంటూ చెప్పడంతో ఆమెపై వస్తున్న విమర్శలకు ఫుల్‌స్టాప్‌ పడింది.


(కుషా కపిల, బాలీవుడ్‌ కమెడియన్‌ అనుభవ్ సింగ్ బస్సీ)

తాజాగా ఆమె గురించి బాలీవుడ్‌ వర్గాల్లో ఒక రూమర్‌ క్రియేట్‌ అయింది ఇటీవల, ఆమె ప్రముఖ బాలీవుడ్‌ కమెడియన్‌తో డేటింగ్‌పై పుకార్లు వచ్చాయి. ఆమె హాస్యనటుడు అనుభవ్ సింగ్ బస్సీతో ప్రేమాయణం సాగిస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ  విహారయాత్రలో భాగంగా గోవాలో చక్కర్లు కొడుతున్నారని తెలుస్తోంది. అనుభవ్ స్టాండ్-అప్ కమెడియన్, యూట్యూబర్ నుంచి నటుడి స్థాయికి చేరుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ ఉంటే యూట్యూబ్‌లో 5 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. అతని వీడియోలకు మిలియన్ల కొద్ది వ్యూస్‌ ఉంటాయి. దీంతో అతని సంపాదన కూడా భారీగానే ఉంది. అతను ఇటీవల   'తు ఝూతీ మైన్ మక్కార్' చిత్రంలో రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్‌లతో కలిసి నటించాడు.

కుషా, బస్సీ మధ్య  రిలేషన్‌పై నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో చాలా సందర్భాలలో వారిద్దరూ కలిసి కనిపించారని ఒక నెటిజన్‌ చెప్పారు. భర్తకు విడాకులిచ్చి సంవత్సరం కూడా కాలేదు.. అప్పుడే మరోకరితో రిలేషన్‌ పెట్టుకుని ఎంజాయ్‌ చేయడం ఏంటి..? కొంచమైనా సిగ్గుగా లేదా..? అంటూ పదునైన విమర్శలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement