జయం రవి విడాకుల కేసు.. కోర్టు కీలక ఆదేశాలు! | Kollywood Actor Jayam Ravi Divorce Petition Hearing In Family Court | Sakshi
Sakshi News home page

Jayam Ravi: జయం రవి విడాకుల కేసు.. కోర్టు కీలక ఆదేశాలు!

Nov 15 2024 4:07 PM | Updated on Nov 15 2024 4:53 PM

Kollywood Actor Jayam Ravi Divorce Petition Hearing In Family Court

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే తన భార్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయంపై ఆయన ఓ లేఖను కూడా  విడుదల చేశారు. ఆ తర్వాత జయం రవి సతీమణి ఆర్తి అతనిపై ఆరోపణలు చేసింది. విడాకుల విషయం గురించి తనకు తెలియదని ఆమె ఆరోపించారు. రవి చేసిన ప్రకటనతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు. ఆ తర్వాత ఆర్తి రవి పేరుతో ఆమె ఒక లేఖను తన సోషల్‌ మీడియాలో విడుదల చేశారు.

అయితే తనకు విడాకులు కావాలని కోరుతూ జయం రవి ఇటీవలే కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా రవి పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. రాజీ చేసుకునేందుకు ప్రయత్నించాలని సూచించింది. కాగా.. ఈ రోజు జరిగిన విచారణకు రవి కోర్టుకు హాజరు కాగా.. ఆయన భార్య ఆర్తి  వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ విచారణలో ఇరువురికి రాజీ కేంద్రంతో మాట్లాడి పరిష్కారం చూపాలని న్యాయమూర్తి ఆదేశించారు.

(ఇది చదవండి: భార్యతో విడాకులు.. అలాంటివారే రూమర్స్ క్రియేట్ చేస్తారు: జయం రవి)

2009లో సినీ నిర్మాత సుజాత విజయకుమార్ కుమార్తె ఆర్తిని జయం రవి పెళ్లాడారు. వీరిద్దరికి  ఆరవ్, అయాన్ పిల్లలు సంతానం కూడా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. మొదట జయం రవి సోషల్ మీడియాలో తన భార్య ఫోటోలను తొలగించారు. 

కాగా.. జయం రవి 1989లో బాలనటుడిగా తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు.   తెలుగు సినిమా ద్వారా బాలనటుడిగా అరంగేట్రం చేసి.. ఆ తర్వాత తమిళ చిత్రసీమలో స్టార్‌గా ఎదిగారు. 2003లో విడుదలైన ‘జయం’ సినిమాతో కోలీవుడ్‌లో క్రేజ్‌ దక్కించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement