చిన్న సినిమా వచ్చి పెద్ద విజయం అందుకున్న చిత్రం ‘కార్తికేయ 2’. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 15.44 కోట్ల షేర్(26.50 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసి ఔరా అనిపించింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.11.54 కోట్ల షేర్, 17.80 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో రోజు రోజుకి థియేటర్స్ సంఖ్య పెరుగుతుంది. దీంతో ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో వరుసగా.. 3.50 కోట్లు, 3.81 కోట్లు, 4.23 కోట్లు సాధించి, నిఖిల్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది.
(చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్, బేబీ బంప్‌తో సర్‌ప్రైజ్)
సిని విశ్లేషకుల సమాచారం ప్రకారం... కార్తికేయ 2 చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.12.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.13.30కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. మూడు రోజుల్లోనే ఆ మార్క్‌ని దాటేసి లాభాల బాట పట్టింది. తొలిరోజే హిట్ టాక్ రావడంతో ఈ వీకెండ్ వరకు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కార్తికేయ2 మూడు రోజుల కలెక్షన్స్(ఏరియాల వారిగా)
► నైజాం -రూ.4.06 కోట్లు
► సీడెడ్ - రూ.1.83 కోట్లు
► ఈస్ట్ - రూ.99లక్షలు
► వెస్ట్ - రూ. 73 లక్షలు
► ఉత్తరాంధ్ర -రూ. 1.51 కోట్లు
► గుంటూరు- రూ. 1.14 కోట్లు
► కృష్ణా - రూ. 87 లక్షలు
► నెల్లూరు - రూ.41 లక్షలు
►కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ. 70 లక్షలు
►ఓవర్సీస్- రూ.2.60 కోట్లు
►నార్త్ ఇండియా-రూ.60లక్షలు
►మొత్తం రూ.15.44 కోట్లు(26.50 కోట్లు గ్రాస్)
Comments
Please login to add a commentAdd a comment