Kajal Aggarwal Latest Photos HD | Kajal Agarwal Latest Photos Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Kajal Agarwal : వారెవ్వా ఏం అందం.. ‘చందమామ’ లెటెస్ట్‌ ఫోటోస్‌ చూశారా?

Nov 23 2021 12:22 PM | Updated on Nov 23 2021 1:06 PM

Kajal Agarwal Latest Photos Goes Viral - Sakshi

Kajal Aggarwal Latest Photos HD: సాధారణంగా హీరోయిన్స్‌ పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటారు. వాళ్లకు నటించాలనే ఆసక్తి ఉన్నప్పటికీ మేకర్స్‌ ఆ అవకాశం ఇచ్చేవారు కాదు. కానీ ఇటీవల ఆ పరిస్థితి మారింది. పెళ్లి అయినప్పటికీ వారి నటనకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఆఫర్లు ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. చాలా మంది హీరోయిన్స్‌ పెళ్లి తర్వాత కూడా  వరుస సినిమాలతో దూసుకెళ్లున్నారు. అలాంటి వారిలో కాజల్‌ అగర్వాల్‌ ఒకరు. 

గత ఏడాది అక్టోబరు 30న వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్‌ ఆ వెంటనే సినిమాల షూటింగ్స్‌తో బిజీ అయిపోయింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు భర్తతో వివాహ జీవితాన్ని ఎంజాయ్‌ చేసుంది.

అయితే పెళ్లి తరువాత కాజల్ అగర్వాల్ ఆచితూచి సినిమాలను ఎంచుకుంటుంది. చిరంజీవి, నాగార్జున లాంటి సినియర్‌ స్టార్స్‌ సరసన నటించే అవకాశం కొట్టేసింది.

 

ఇంత బిజీగా ఉన్నప్పటీకీ.. సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది కాజల్‌. వ్యక్తిగత విషయాలు, సినిమా కబుర్లతో పాటు హాట్‌ హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులకు ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చందమామ రెడ్‌ కలర్‌ డ్రెస్‌లో దర్శనమిచ్చి కుర్రకారుల మతులు పొగొట్టింది.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ‘ఉమ’, ‘ఘోస్టీ’, ‘కరుంగాప్పియమ్‌’, ‘హే సినామిక’ షూటింగ్‌లను పూర్తి చేసిన ఈ బ్యూటీ చిరంజీవితో ఆచార్య, నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న “ఘోస్ట్” సినిమాలతో బిజీగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement