బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న కాజల్‌.. మైండ్‌ బ్లోయింగ్‌ పిక్స్‌ వైరల్‌ | Latest Photos of Kajal Aggarwal in Black Designer Wear Will Leave You in Awe | Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: చందమామ అందాల విందు.. బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిపోయిన కాజల్‌

Sep 22 2021 1:32 PM | Updated on Sep 22 2021 2:10 PM

Latest Photos of Kajal Aggarwal in Black Designer Wear Will Leave You in Awe - Sakshi

పెళ్లి తర్వాత కూడా తన వరుస సినిమాలతో దూసుకెళ్తుంది ‘చందమామ’ కాజల్‌ అగర్వాల్‌. గత ఏడాది అక్టోబరు 30న వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్‌ ఆ వెంటనే సినిమాల షూటింగ్స్‌తో బిజీ అయిపోయింది. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు భర్తతో వివాహ జీవితాన్ని ఎంజాయ్‌ చేసుంది.

ఖాళీ సమయం దొరికితే చాలు విహారయాత్రలకు ప్లాన్‌ చేస్తుంది ఈ నవ జంట.  కాజల్‌ కెరీర్‌కి కిచ్లు సపోర్ట్‌ చేస్తుంటే.. ఆయన వ్యాపార సంస్థల ఉత్పత్తులకు ఆమె ప్రచార కర్తగా వ్యవహరిస్తూ భారీ ప్రచారం తెచ్చిపెడుతోంది. 

ఇంత బిజీగా ఉన్నప్పటీకీ.. సోషల్‌ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది కాజల్‌. వ్యక్తిగత విషయాలు, సినిమా కబుర్లతో పాటు హాట్‌ హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులకు ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చందమామ బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌లో దర్శనమిచ్చి కుర్రకారుల మతులు పొగొట్టింది.

 

ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ ఫ్యాబ్ లుక్ కోసం కాజల్ ఈ హాట్ ఫోజులిచ్చింది.

ఇటీవల కాజల్‌ తల్లి కాబోతుందని వార్తలు వినిపించాయి. ఈ పుకార్లకు చెక్‌ పెట్టేందుకే ఇలా వెరైటీ ఫోటో షూట్స్‌ చేస్తుందని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ‘ఉమ’, ‘ఘోస్టీ’, ‘కరుంగాప్పియమ్‌’, ‘హే సినామిక’ షూటింగ్‌లను పూర్తి చేసిన ఈ బ్యూటీ చిరంజీవితో ఆచార్య, నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న “ఘోస్ట్” సినిమాలతో బిజీగా ఉంది.

కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు 2 మూవీలో కాజల్ హీరోయిన్ గా చేశారు. కొన్ని వివాదాల కారణంగా మూవీ షూటింగ్‌ వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement