మహేష్ బాబాయ్‌ నాకు చాలా ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడు | Jayakrishna debuts under supervision of Mahesh Babu | Sakshi
Sakshi News home page

మహేష్ బాబాయ్‌ నాకు చాలా ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడు

May 30 2026 11:49 PM | Updated on May 31 2026 6:07 AM

Jayakrishna debuts under supervision of Mahesh Babu

ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్‌ బాబు కొడుకు జయకృష్ణ శ్రీనివాస మంగాపురం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. జయకృష్ణ డెబ్యూ విషయంలో మహేష్ బాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడట. సినిమా కంటెంట్, ఎమోషన్ అన్నింటినీ దగ్గరుండి గమనించి, తన ఫీడ్‌బ్యాక్ ఇచ్చాడని జయకృష్ణ స్వయంగా వెల్లడించాడు. మహేష్ ఇచ్చిన సూచనలు ఈ సినిమాకు చాలా హెల్ప్ అయ్యాయని జయకృష్ణ చెబుతున్నాడు.  

శ్రీనివాస మంగాపురం గురించి జయకృష్ణ మాట్లాడుతూ.. ఈ సినిమా లోతైన ఎమోషన్ కలిగిన సినిమా. నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇది సరైన కథ అని పేర్కొన్నాడు. ఈ సినిమాలో రవీనా టాండన్ కూతురు రాషా తడానీ హీరోయిన్‌గా నటిస్తోంది. కృష్ణ జయంతి సందర్భంగా ఈరోజు సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు. ఈ చిత్రం జులై 9న థియేటర్లలో విడుదల కానుంది.  

తాతయ్య ఆశీస్సులు నాతో ఉంటాయి
‘‘తాతయ్య కృష్ణగారు నాకు దేవుడితో సమానం. ఆయన ఎక్కడ ఉన్నా తన ఆశీస్సులు నాతో ఉంటాయని నమ్ముతున్నాను. తాతయ్య పుట్టినరోజు సందర్భంగా మీ అందర్నీ కలవడం హ్యాపీగా ఉంది. హీరో అవ్వాలనే ఆలోచనకు ప్రేరణ మా బంగారు తాతయ్య (కృష్ణ సోదరుడు–నిర్మాత ఆదిశేషగిరి రావు). అలాగే మా బాబాయ్‌ మహేశ్‌బాబుకి నేను డైహార్డ్‌ ఫ్యాన్‌ని. ఈ సినిమా ఫస్ట్‌ లుక్, టీజర్‌ను లాంచ్‌ చేసి, ఫీడ్‌బ్యాక్‌ ఇస్తూ, నన్ను ప్రోత్సహిస్తున్న మా బాబాయ్‌కి థ్యాంక్స్‌. ఈ సందర్భంగా మా నాన్న రమేశ్‌బాబుగారిని తలచుకుంటున్నాను. మా తాతగారితో ‘అగ్నిపర్వతం’, బాబాయ్‌ మహేశ్‌బాబుగారితో ‘రాజకుమారుడు’ చేశారు దత్తుగారు. ఇప్పుడు నన్ను హీరోగా పరిచయం చేస్తున్న  ఆయనకు రుణపడి ఉంటాను.

కిరణ్, అజయ్‌ భూపతి, రాషా, రాఘవేంద్ర రావు, జయకృష్ణ, అశ్వినీదత్, ఆదిశేషగిరి రావు 

ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారని నమ్ముతున్నాను. ‘‘ఈ సినిమా నా కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అన్నారు రాషా. ‘‘కృష్ణగారు నిజమైన సూపర్‌స్టార్‌. ఆయన చేసినంత రిస్క్‌ ఏ హీరో కూడా చేసి ఉండరు. ఆ కృష్ణగారి క్వాలిటీస్‌ జయకృష్ణలో ఉన్నాయి. జయకృష్ణ పెద్ద హీరో అవుతాడని దర్శకుడు అజయ్‌ భూపతి అన్నారు. ‘‘కృష్ణగారిలాగే జయకృష్ణ కూడా తన ప్రతిభను చూపించాడు’’ అని పేర్కొన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్‌. ‘‘జయకృష్ణ న్యూయార్క్‌లో ఫిల్మ్‌ కోర్సు చదివాడు. ఈ సినిమాతో జయకృష్ణ హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది’’ అని తెలిపారు ఆదిశేషగిరి రావు. ‘‘శ్రీనివాస మంగాపురం’ అని పేరు పెట్టడమే ఈ సినిమా మొదటి విజయం’’ అన్నారు దర్శక–నిర్మాత కె. రాఘవేంద్ర రావు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement