Janhvi Kapoor Talks About Her Unique Inheritance - Sakshi
Sakshi News home page

Janhvi Kapoor: ఆ విషయం మనసుకు బాధ కలిగిస్తోంది

Published Sun, Nov 27 2022 7:16 AM

Janhvi Kapoor talks about her unique inheritance - Sakshi

దివంగత అతిలోక సుందరి శ్రీదేవి, బాలీవుడ్‌ నిర్మాత బోనీకపూర్‌లో పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ అనే విషయం తెలిసిందే. శ్రీదేవి వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ తడక్‌ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైంది. తొలి చిత్రంతోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేసినా.. అనుకున్న స్థాయిలో స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకోలేక పోయింది.

అంతేకాకుండా జాన్వీ కపూర్‌ నటించిన కొన్ని మంచి కథా చిత్రాలు థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల కావడంతో ఆమెతో పాటు అభిమానులు కూడా నిరుత్సాహానికి గురయ్యారు. అయితే తన గ్లామరస్‌ ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ జాన్వీ కపూర్‌ మాత్రం ట్రెండింగ్‌లోనే ఉంది. ఇటీవల రూ.70 కోట్లతో కొత్త ఇల్లు కొనుగోలు చేసిందనే ప్రచారం హోరెత్తుతోంది.

మరో పక్క ఈ బ్యూటీ దక్షిణాదిలో అడుగు పెట్టాలని ఆశిస్తున్నా, అలాంటి అవకాశం సెట్‌ అవ్వడం లేదు. కాగా తాజా ఆమె మాట్లాడుతూ..  వారసత్వ ముద్ర వేయడం తనకు భారంగానే అనిపిస్తోందన్నారు. బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ తనను సినీ వారసురాలనే ప్రచారం చేయడం మనసుకు బాధ కలిగిస్తోందన్నారు. కరణ్‌ జోహార్‌ మంచి కథా చిత్రాలను నిర్మిస్తున్నారని,  తన సంస్థ చిత్రాల్లో నటించడం అదృష్టంగా జాన్వీ కపూర్‌ పేర్కొంది.   

చదవండి: (Kamal Haasan: అప్పట్లో ప్రమాదం జరిగితే..)

Advertisement
 
Advertisement
 
Advertisement