Janhvi Kapoor: నేనేమి పెద్ద అందగత్తెను కాదు..: జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు

Janhvi Kapoor Said She May Not be Most Talented, But Iam Hard Working - Sakshi

నెపోటిజం.. ఈ పదం ఎక్కువగా బాలీవుడ్‌లో వినిపిస్తుంది. అక్కడ ప్రస్తుతం రాణిస్తున్న స్టార్స్‌లో వారసత్వంతో వచ్చినవారే ఎక్కవ ఉంటారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందులో హీరోయిన్‌ జాన్వి కపూర్‌ ఒకరు. దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి తనయగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ. ఆమె తండ్రి బోని కపూర్‌ కూడా బడా నిర్మాత కావడంతో తరచూ ఆమె స్టార్‌ కిడ్‌గా గుర్తింపు పొందింది. వార వారసురాలిగా ఇండస్ట్రీకి వచ్చిందని, అయితే తనలో టాలెంట్‌ లేదంటూ, తల్లి అంత అందంగా కూడా లేదంటూ తరచూ ఆమె ట్రోల్స్‌ బారిన పడుతుంది. 

చదవండి: Nayanthara-Vignesh Shivan: సరోగసీ వివాదం.. వైరల్‌గా విఘ్నేశ్‌ శివన్‌ పోస్ట్‌

ఈ క్రమంలో తాజాగా తనపై వస్తున్న ట్రోల్స్‌పై జాన్వీ ఘాటుగా స్పందించింది. తాను పెద్ద టాలెంట్‌ కాకపోవచ్చు, అందగత్తెను కూడా కాదు.. కానీ కష్టపడేతత్త్వం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానంటూ ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చింది. రీసెంట్‌గా ఓ చానల్‌తో ముచ్చటించిన ఆమె ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ‘నా గురించి చాలా మందిలో దురభిప్రాయం ఉంది. నేను వారసత్వం ద్వారా వచ్చి.. స్టార్ డమ్‌ పొందాలని అనుకోవడం లేదు. నాకంటూ సొంతంగా గుర్తింపు పొందాలి అనుకుంటున్నా. అయినా నేనేమి గొప్ప టాలెంట్ కాదు.

చదవండి: ఓటీటీకి వచ్చేస్తోన్న కృష్ణ వ్రింద విహారి, ఆ రోజు నుంచి స్ట్రీమింగ్‌, ఎక్కడంటే

పెద్ద అందగత్తేను కూడా కాదు. కానీ సెట్స్‌లో వందకు వందశాతం కష్టపడతాను. కష్టపడేతత్త్వంలో నాలో ఉంది. అందువల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో  ఉన్నాను. సెట్‌లో ఎంతో కష్టపడి పనిచేస్తానని హామీ ఇవ్వగలను. ఇదే విషయాన్ని మీకు నా రక్తంతో కూడా రాసిస్తాను. నా పనితీరుపై అనుమానమే అక్కర్లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. అనంతరం ఒకటే పనిని పదే పదే చేయడం తనకు ఇష్టం లేదని, సవాళ్లతో కూడిన పనిని చేసేందుకు తాను ఆసక్తిచూపుతానని తెలిపింది. కాగా జాన్వీ ఇటీవల గుడ్‌లక్‌ జెర్రీలో కనిపించింది. ప్రస్తుతం ఆమె మిలి చిత్రంతో బిజీగా ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top