
'నాటకం', 'తీస్ మార్ ఖాన్' సినిమాలు తీసిన దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ ఇప్పుడు మరో మూవీ సిద్ధం చేస్తున్నారు. దసరా సందర్భంగా ఆ చిత్రం అప్‌డేట్ ఇచ్చారు. 'మారియో' అనే టైటిల్ నిర్ణయిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
హీరోహీరోయిన్లుగా అనిరుధ్, హెబ్బా పటేల్ నటించారు. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో 'మారియో' చిత్రాన్ని నిర్మిస్తుండగా రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గత చిత్రాలలో కామెడీ, థ్రిల్‌ను విజయవంతంగా మిళితం చేసిన దర్శకుడు కళ్యాణ్‌జీ గోగణ ఈసారి సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతున్నారు. ఈ చిత్రానికి సాయి కార్తీక్, రాకేందు మౌళి సంగీతాన్ని అందిస్తున్నారు.
