Happy Birthday Megastar: ‘మెగాస్టార్‌’ అంటే ఓ బ్రాండ్‌.. మరి ఈ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా?

Happy Birthday Megastar: Do You Know Who Gave Megastar Title to Chiranjeevi - Sakshi

మెగాస్టార్‌.. అంటే ఓ బిరుదు మాత్రమే కాదు తెలుగు సినీ పరిశ్రమలో ఇదొక బ్రాండ్‌. పరిశ్రమలో అంచలంచలుగా ఎదుగుతూ మెగా హీరోగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. తొలుత ఓ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విలన్‌గా కూడా మెప్పించారు. ఇక హీరోగా మారి బాక్సాఫీసుకు బ్లాక్‌బస్టర్‌లను అందిస్తూ సుప్రీం హీరోగా ఎదిగారు. సినిమాల్లో ‘స్వయం కృషి’తో ఎదిగిన ఆయన తన నటన, డాన్స్‌తో అభిమానుల గుండెల్లో మెగాస్టార్‌గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.  ఆరు పదుల వయసులో కూడా నేటితరం యువ హీరోలకు గట్టి పోటీ ఇవ్వడం ఒక్క ఆయనకే చెల్లింది.

చదవండి: HBD Megastar Chiranjeevi: వన్‌ అండ్‌ ఓన్లీ 'మెగాస్టార్‌' చిరంజీవి

దాదాపు 150పైగా చిత్రాల్లో నటించిన చిరు సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించి మెగాస్టార్‌ అంటే ఒక ఓ బ్రాండ్‌ అనేంతగా పేరు తెచ్చుకున్నారు. అభిమానులంతా మెగాస్టార్‌ మెగాస్టార్‌ అంటూ జపం చేసే ఈ బిరుదు ఆయనకు ఎలా వచ్చిందో మీకు తెలుసా?. అసలు ఆయనకు ఈ టైటిల్‌ ఎవరిచ్చారో తెలుసా? మరి తెలుసుకోవాలంటే ఇక్కడో లుక్కేయండి. ఎన్టీఆర్, కృష్ణ వంటి సూపర్‌స్టార్‌లు తెలుగులో స్టార్‌ హీరోలుగా ఉన్న సమయంలో చిరంజీవితో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు నిర్మాత కేఎస్‌. రామారావు. చిరంజీవి, కేఎస్‌ రామారావుల కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘అభిలాష’.

యండమూరి వీరేంద్రనాథ్ నవలా ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టాలీవుడ్‌లో సూపర్ హిట్‌‌గా నిలిచింది. ఆ తర్వాత అదే యండమూరి నవల ఆధారంగా కొందండరామి రెడ్డీ దర్శకత్వంలో నిర్మాత కేఎస్ రామరావు నిర్మాణంలో చిరు హీరోగా ‘ఛాలెంజ్’ ‘రాక్షసుడు’ చిత్రాలు తెరకెక్కించారు. ఈ సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందించాయి. అయితే రాక్షసుడు మూవీతోనే చిరంజీవి తమ్ముడు నాగబాబు నటుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత చిరంజీవి, కేఎస్‌ రామారావు కలయికలో వచ్చిన నాలుగవ చిత్రం ‘మరణ మృదంగం’.

చదవండి: 'చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌' ఏర్పాటు చేయడానికి కారణమేంటో తెలుసా?

ఇది కూడా యండమూరి వీరేంద్రనాథ్ నవలా ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీ కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్ సాదించింది. ఈ చిత్రం టైటిల్‌తోనే అప్పటి వరకు సుప్రీం హీరో ఉండే చిరంజీవి పేరు మెగాస్టార్‌ చిరంజీవిగా మారింది. సినిమా పేర్లు పడుతుండగా హీరో పేరు రాగానే మెగాస్టార్‌ అని రావడంతో థియేటర్‌ అంతా అభిమానుల ఈళలతో మారుమోగిందట.  ఈ సినిమాతో నిర్మాత కేఎస్‌ రామారావు చిరంజీవికి అందించిన అరుదైన బిరుదు ఇది. అప్పటి వరకు చిరును సుప్రీం హీరోగా పిలుచుకునే అభిమాలంతా మెగాస్టార్‌గా పిలవడం ప్రారంభించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top