హీరోయిన్ లయతో పెళ్లి.. ఆ కారణం వల్లే ఆగిపోయింది: సాయి కిరణ్ | Guppedantha Manasu Fame Sai Kiran about Marriage with Heroine Laya | Sakshi
Sakshi News home page

Sai Kiran: హీరోయిన్ లయతో పెళ్లి.. ఆ కారణం వల్లే ఆగిపోయింది: సాయి కిరణ్

Nov 26 2023 4:17 PM | Updated on Nov 28 2023 12:46 PM

Guppedantha Manasu Fame Sai Kiran about Marriage with Heroine Laya - Sakshi

నువ్వే కావాలి సినిమాతో హీరోగా అడుగుపెట్టన నటుడు సాయి కిరణ్. ఆ తర్వాత ప్రేమించు సినిమాతో బ్లాక్ బస్టర్‌ హిట్ కొట్టాడు. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గుప్పెడంత మనసు సీరియల్‌లో నటిస్తున్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సాయి కిరణ్‌.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అంతే కాకుండా లయ, సాయి కిరణ్ జంటగా నటించిన ప్రేమించు మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో లయ బ్లైండ్‌ పాత్రలో నటించడంపై మాట్లాడారు. 

(ఇది చదవండి: కార్తి హీరోగా మొదటి సినిమా.. వివాదంపై సముద్రఖని ఆగ్రహం!)

లయ పాత్రపై మాట్లాడుతూ.. 'లయ బ్లైండ్‌గా నటించేదుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారు. ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేశారు. అందువల్లే ఈ సినిమా నేషనల్ అవార్డ్ వరకు వెళ్లింది. నీ జీవితాంతం ఈ సినిమా గుర్తుంటుందని రామానాయుడు అన్నారు. లయతో పెళ్లి విషయంపై మాట్లాడుతూ.. చూడడానికి జంట బాగుంది. పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మా తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ మా జాతకాలు కలవలేదు. అందువల్లే సెట్ అవ్వలేదు. మా మధ్య లవ్ అలాంటివేమీ లేవు. మేం కూడా కుదిరితే చేసుకుందామనుకున్నాం. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌గా ఉన్నాం.  ఆ తర్వాత ఇంద్రజిత్ అనే షో చేశాం. ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ ఎంత బాగుందో మూవీలో నటించాం. జాతకాలు నేను చాలా గట్టిగా నమ్ముతా. పేరేంట్స్ కూడా నమ్ముతారు. ఒకప్పుడు నమ్మేవాడిని కాదు. కానీ ఆ తర్వాత వాటి గురించి తెలుసుకున్నా.' అని అన్నారు. 

(ఇది చదవండి: స్టార్‌ కమెడియన్‌ మరణంతో అనాథగా మారిన ప్రియుడు.. చివరకు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement